Bigg Boss 5 Telugu: నా సపోర్ట్ శ్రీరామ్ చంద్రకే : సోనూ సూద్

బిగ్ బాస్5 తెలుగు రోజు రోజుకీ రసవత్తరంగా మారుతోంది.ఎవ్వరూ ఊహించని విధంగా హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించుకున్న విశ్వ ఎలిమినేట్ అయ్యాడు. కచ్చితంగా టాప్ 5 లో అతను ఉంటాడు అని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆర్డర్ మొత్తం మారిపోయింది. టైటిల్‌ను గెలుచుకునే టాప్ 5 కంటెస్టెంట్స్ లో పాపులర్ సింగర్, నటుడు శ్రీరామచంద్ర కూడా చేరినట్టు తెలుస్తోంది. అతను గేమ్ పెద్దగా ఆడడం లేదు అని కొంతమంది అంటున్నా, సోషల్ మీడియాలో అతనికి బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది.

ఓట్లు కూడా అతనికి బాగానే పడుతున్నాయి. పైగా కొద్దిరోజులుగా అతనికి స్టార్ నటీనటుల నుండీ సపోర్ట్ కూడా లభిస్తుండడం మనం చూస్తూనే వస్తున్నాం. మొన్నటికి మొన్న టాలీవుడ్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్.. శ్రీరామ చంద్రకు మద్దతు ఇస్తూ ఓ పోస్ట్ పెట్టింది. అతను విన్నర్ అయ్యేందుకు ఓట్లు వేయాలని అభిమానులని కోరింది. ఆమెతో పాటు బాలీవుడ్ కమెడియన్ భారతీ సింగ్ కూడా శ్రీరామ చంద్రకు ఓటు వేయాలని కోరాడు. తాజాగా ఈ లిస్ట్ లోకి సోనూ సూద్ కూడా వచ్చి చేరినట్టు స్పష్టమవుతుంది.

‘బిగ్‌బాస్‌5 లో శ్రీరామ్‌ను చూస్తున్నారా? నేను కూడా చూస్తున్నాను. శ్రీరామ్‌ నీ బెస్ట్ నువ్వు ఇవ్వు. ఇస్తావ్ అని ఆశిస్తున్నాను. నీకు ఇవే నా అభినందనలు.. అంటూ ఓ వీడియోని విడుదల చేసాడు. వరుసగా ఇలా స్టార్లు శ్రీరామ్ చంద్రకి సపోర్ట్ చేస్తుండడంతో.. అతనే ‘బిగ్‌బాస్‌5’ విన్నర్ అవుతాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus