Soundarya: సౌందర్య రజనీకాంత్‌ రెండో బిడ్డ పేరేంటంటే?

ప్రముఖ నటుడు రజనీకాంత్‌ చిన్న కుమార్తె సౌందర్య పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో తెలియజేస్తూ చిన్నారి తన వేలును పట్టుకున్న ఫొటోను షేర్‌ చేశారు. సౌందర్యకు గతంలోనే ఓ మగబిడ్డ ఉన్న విషయం తెలిసిందే. అలా రజనీకాంత్‌కు మరో మనవడు పుట్టాడు అన్నమాట. అంతేకాదు ఈ బిడ్డకు ‘వీర్‌ రజనీకాంత్‌ వనంగమూడి’ అని పేరు కూడా పెట్టారు. ఈ మేరకు సౌందర్య రజనీ కాంత్‌ సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు.

‘‘ దేవుని దయ, తల్లిదండ్రుల ఆశీర్వాదాలతో వేద్‌ కృష్ణ తమ్ముడికి నేను, విశాగన్‌ స్వాగతం పలుకుతున్నాం’’ అంటూ పోస్ట్‌లో రాసుకొచ్చారు సౌందర్య. వ్యాపారవేత్త అశ్విన్‌ కుమార్‌తో గతంలో సౌందర్య రజనీకాంత్‌కు వివాహమైంది. వారికి వేద్‌కృష్ణ జన్మించాడు. అయితే వివిధ కారణాలతో వారు విడాకులు తీసుకున్నారు. అనంతరం వ్యాపారవేత్త విశాగన్‌ వనంగమూడిని సౌందర్య రాజనీకాంత్‌ 2019లో వివాహం చేసుకున్నారు. ఇప్పుడు ఈ దంపతులకు వీర్‌ జన్మించాడు.

ఈ క్రమంలో సౌందర్య రజనీకాంత్‌ తనకు ప్రసవం చేసిన వైద్యులు సుమన మనోహర్‌, శ్రీవిద్య శేషాద్రికి ధన్యవాదాలు తెలిపారు. దీంతోపాటు ఈ సోషల్‌ మీడియా పోస్టులో తను బేబీ బంప్‌తో ఉండగా భర్త విశాగన్‌, వేద్‌తో దిగిన కొన్ని ఫొటోలను కూడా షేర్‌ చేశారు. వీర్‌ రజనీకాంత్‌ జన్మించిన విషయాన్ని తెలుసుకున్న అభిమానులు సోషల్‌ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. టాలీవుడ్‌, కోలీవుడ్‌ ప్రముఖులు చాలామంది సౌందర్య, విశాగన్‌ దంపతులకు అభినందనలు తెలియజేస్తున్నారు.

ఇక సౌందర్య గురించి చూస్తే.. గ్రాఫిక్‌ డిజైనర్‌గా ఆమె తన కెరీర్‌ను ప్రారంభించారు. ‘పడయప్పా’, ‘బాబా’, ‘చంద్రముఖి’, ‘శివాజీ’ సినిమాలకు టైటిల్‌ డిజైనర్‌గా చేశారు. ఆ తర్వాత ‘అన్బే అరియురే’, ‘శివకాశీ’, ‘సందెకొళి’, ‘మజా’, ‘చెన్నై 600028’ లాంటి సినిమాలకు గ్రాఫిక్‌ డిజైనర్‌గా పని చేశారు. ‘గోవా’ సినిమాను నిర్మించిన ఆమె ఆ తర్వాత ‘కోచ్చడయాన్‌’తో దర్శకురాలిగా మారారు. ఆ తర్వాత ‘వీఐపీ 2’ తీశారు. ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ అనే వెబ్‌ సిరీస్‌కు క్రియేటివ్‌ డైరక్టర్‌గా చేస్తున్నారు కూడా.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus