భారత దిగ్గజ ఆటగాడు, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ జీవితం సినిమాగా మారబోతోంది. చాలా రోజులుగా జరుగుతున్న ఈ చర్చ ఇప్పుడు ఓ కొలిక్కి వచ్చింది అని అంటున్నారు. అభిమానులు ముద్దుగా ‘దాదా’ అని పిలుచుకునే గంగూలీ జీవితాన్ని సినిమాగా తీసుకొస్తామని రెండేళ్ల క్రితమే అనౌన్స్ చేశారు. ఈ బయోపిక్‌ను నిర్మిస్తున్నామని లవ్ ఫిల్మ్స్ 2020లోనే పేర్కొంది. ప్రస్తుతం సినిమా స్క్రిప్ట్ తుది దశలో ఉందట. దాదా జీవితం గురించి అందరికీ తెలుసు అని అనుకుంటారు.
అయితే అది ఆయన క్రికెటర్ అయ్యాకనే. అంతకుముందు దాదా జీవితంలో ఏం జరిగింది అనేది చాలా తక్కువమందికి తెలుసు. ఒకట్రెండు విషయాలు తెలిసినా.. అవి పుకార్లుగా మాత్రమే బయటకు వచ్చినవి. ఇప్పుడు వాటిని సినిమాల్లో చూపించే పరిస్థితి ఉండదు. దీంతో సినిమాకి స్క్రీన్‌ప్లే అత్యంత కీలకం కావడంతో దానిపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. కథ, స్క్రీన్‌ప్లే సంగతిని ఫైనల్ చేయడానికి సౌరవ్ గంగూలీ సోమవారం రాత్రి కోల్‌కతా నుండి ముంబయి వచ్చారట.
నిర్మాతలు, రచయితలతో చర్చించి కథ, స్క్రీన్‌ప్లేకు ఓకే చెప్పడమే తరువాయి. అన్నీ ఓ కొలిక్కి రాగానే ఫిబ్రవరిలో రెగ్యలర్ షూటింగ్ ప్రారంభించే అవకాశం ఉన్నట్టు సమాచారం. అయితే సినిమాలో హీరో ఎవరు, ఇతర మఖ్యపాత్రధారులు ఎవరు అనే వివరాలను సినిమా ప్రారంభానికి ముందు వెల్లడిస్తారని సమాచారం. భారత క్రికెట్ చరిత్రలో గంగూలీ పేరు అనేక పేజీల్లో ఉంది. డేరింగ్ అండ్ డ్యాషింగ్ బ్యాటర్‌గా పేరు తెచ్చుకున్న దాదా, ఆ తర్వాత కెప్టెన్ అయ్యి..
మన జట్టు విజయవంతమైన కెప్టెన్ల సరసన చేరాడు. జట్టుకు కొత్త దూకుడును నేర్పించిన కెప్టెన్ అంటూ దాదాను అభిమానులు కొనియడుతుంటారు. అలాంటి దాదా వ్యక్తిగత జీవితంలోనూ చాలా షేడ్స్ ఉన్నాయి. వాటిని ఇప్పుడు సినిమాలో చూడొచ్చు. ఇప్పటికే సచిన్ టెండుల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ, కపిల్ దేవ్ (83), ప్రవీణ్ తంబే లాంటి క్రికెటర్ల కథలకు మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు దాదా సంగతి చూడాలి.
వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!
‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?