సౌత్ తో పోలిస్తే బాలీవుడ్ అనేది చాలా పెద్ద మార్కెట్. ఆ తర్వాత కోలీవుడ్ అనేది పెద్ద మార్కెట్ అంటుంటారు ట్రేడ్ పండితులు. అయితే కొంతకాలంగా బాలీవుడ్ జనాలని భారీ ఎత్తున థియేటర్లకు తీసుకొచ్చే సినిమాలు రావడం లేదు. అక్కడ మన సౌత్ సినిమాల డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. యూట్యూబ్ లో కూడా అక్కడి జనాలు ఎక్కువగా ఎంజాయ్ చేసేది మన సౌత్ సినిమాలు చూసే.! ఇక్కడ అట్టర్ ప్లాప్ అయిన సినిమాలు కూడా అక్కడ డబ్ చేసి యూట్యూబ్ లో విడుదల చేయగా .. వాటికి వందల కొద్దీ మిలియన్ల వ్యూస్ నమోదవుతూ ఉంటాయి. వాటిని చూస్తూ ఎంజాయ్ చేస్తున్న నార్త్ జనాలు థియేటర్లకు వెళ్ళడం కూడా తగ్గించేశారు. ఇది తాజాగా విడుదలైన ‘కె.జి.ఎఫ్ చాప్టర్2’ తో మరోసారి ప్రూవ్ అయ్యింది. ఈ డబ్బింగ్ మూవీ కోసం ఏకంగా అక్కడి స్టార్ హీరో మూవీనే పోస్ట్ పోన్ చేసారు అంటే… అక్కడి పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. నిన్న అంటే ఏప్రిల్ 14న విడుదలైన ‘కె.జి.ఎఫ్2’ మూవీ మొదటి రోజు హిందీలో అత్యధిక కలెక్షన్లు నమోదు చేసిన మూవీగా రికార్డులు సృష్టించింది. మొదటి రోజు ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసింది. దీంతో పాటు మొదటి రోజు అక్కడ అత్యథిక కలెక్షన్లు రాబట్టిన టాప్ 10 మూవీస్ ఏంటి? అనే విషయాల పై ఓ లుక్కేద్దాం రండి :
1) కె.జి.ఎఫ్ 2 :
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా తెరకెక్కిన ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ మూవీ తొలి రోజు అక్కడ రూ.53.95 గ్రాస్ కలెక్షన్లను రాబట్టి.. హిందీలో అత్యధిక కలెక్షన్లను నమోదు చేసిన మూవీగా ఆల్ టైం రికార్డు సృష్టించింది. ఎన్నాళ్ళు ఉంటుందో తెలీదు కానీ ప్రస్తుతానికి అయితే అక్కడ డే1 టాప్ గ్రాసర్ ఈ మూవీనే..!
2) వార్ :
హృతిక్ రోషన్ & టైగర్ ష్రాఫ్ ల కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ అక్కడ మొదటి రోజు రూ.51.6 కోట్ల గ్రాస్ ను కొల్లగొట్టింది.
3) థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ :
ఆమిర్ ఖాన్- అమితాబ్ కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ మొదటి రోజు రూ.50.75 కోట్ల గ్రాస్ ను కొల్లగొట్టింది.
4) హ్యాపీ న్యూ ఇయర్ :
షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన ఈ మూవీ అక్కడ మొదటి రోజు రూ.42.62 కోట్ల గ్రాస్ ను కొల్లగొట్టింది.
5) భారత్ :
సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ఈ మూవీ అక్కడ మొదటి రోజు రూ.42.30 కోట్ల గ్రాస్ ను కొల్లగొట్టింది.
6) బాహుబలి2 :
రాజమౌళి- ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీ అక్కడ మొదటి రోజు రూ.41 కోట్ల గ్రాస్ ను కొల్లగొట్టింది.
7) ప్రేమ్ రతన్ ధన్ పాయో :
సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ఈ మూవీ మొదటి రోజు రూ.40.35 కోట్ల గ్రాస్ ను కొల్లగొట్టింది.
8) సుల్తాన్ :
సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ఈ మూవీ మొదటి రోజు అక్కడ రూ.36.54 కోట్ల గ్రాస్ ను కొల్లగొట్టింది.
9) సంజు :
సంజయ్ దత్ బయోపిక్ గా రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ మొదటి రోజు అక్కడ రూ.34.75 కోట్ల గ్రాస్ ను కొల్లగొట్టింది.
10) టైగర్ జిందా హై :
సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ఈ మూవీ మొదటి రోజు అక్కడ రూ.34.10 కోట్ల గ్రాస్ ను కొల్లగొట్టింది.
ఇదండీ.. బాలీవుడ్ టాప్ 10 గ్రాసర్ మూవీస్ లిస్ట్. గర్వించదగ్గ విషయం ఏంటి అంటే ఈ లిస్ట్ లో మన సౌత్ సినిమాలు రెండు ఉండడం. ‘బాహుబలి 2’ తెలుగు సినిమా కాగా.. ‘కె.జి.ఎఫ్2’ అనేది కన్నడ సినిమా. భవిష్యత్తులో మరిన్ని సౌత్ సినిమాలు బాలీవుడ్లో రికార్డులు కొట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. ఫుల్ రన్లో ‘బాహుబలి2’ లానే ‘కె.జి.ఎఫ్2’ కూడా అద్భుతాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు కూడా అక్కడ బుకింగ్స్ భారీగా జరుగుతున్నాయి.