లెజెండరీ సింగర్ ఎస్.పి.బాలసుబ్రమణ్యం మరణ వార్త .. సంగీత అభిమానులను శోక సంద్రంలో ముంచేస్తుంది. కరోనా వైరస్ సోకడంతో ఆగష్ట్ లో చెన్నై లోకి ఓ ఆసుపత్రిలో అడ్మిట్ అయిన ఆయన…40రోజుల పాటు కరోనాతో యుద్ధం చేసి విస్మయించారు.ఆయన 40ఏళ్ళ సినీ కెరీర్లో 16భాషల్లో కలిపి 40వేలకు పైగా పాటలు పాడారు. ఆయన మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నత దశకు చేరుకున్నాక ఎంతో ప్రతిభావంతులను ఇండస్ట్రీలో ఎదగకుండా చేశారనే అభియోగాలు కూడా వెలువడ్డాయి.
వీటి పై ఆయన ఓ ఇంటర్వ్యూలో స్పందించి క్లారిటీ ఇచ్చారు. ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. “నా జీవితమంతా ఓ వింత ప్రయాణమే.! మొదట్లో నాకు సంగీతంపై ఏమాత్రం ఆసక్తి లేదు. ఇంజినీరు కావాలనుకున్నాను.. కానీ అనుకోకుండా గాయకుడినయ్యాను.సుమారు 20ఏళ్ల పాటు నేను సిగరెట్లు కాల్చాను. 40 ఏళ్ల కెరీర్లో రోజుకు 10 గంటలు పాటలు పాడేవాడిని.ఈ స్థాయికి రావడానికి నేను అంత కష్టపడ్డాను. నేను కొత్తవారిని తొక్కేశానని ఆరోపణలు కూడా వచ్చాయి.వాటిలో ఎంత మాత్రం నిజం లేదు. నా కెరీర్లో నేను ఎవ్వరికీ హాని తలపెట్టలేదు.
కొత్త ట్యాలెంట్ ఎక్కడున్నా వెతికి మరీ ప్రోత్సహించేవాడిని. నాకున్న పేరు ప్రతిష్ఠల వల్ల నా కొడుకు కెరీర్ కూడా సక్రమంగా కొనసాగడం లేదు. చరణ్‌ను ప్రతీ విషయంలోనూ నాతో పోల్చి చూడటం వల్ల వాడికి చాలా నష్టం జరుగుతుంది. సంగీతం అని, నటన అని, సినిమా నిర్మాణం అని చాలా తడబడ్డాడు. ఐదు సినిమాలు నిర్మించి ఇప్పటికే 11కోట్లు పోగొట్టుకున్నాడు” అంటూ ఎమోషనల్ గా చెప్పుకొచ్చారు.
Most Recommended Video
బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!