కన్నీళ్లు పెట్టిస్తున్న బాలు చివరి పాట.. లిరిక్స్ లో ఉన్నదే ప్రాణం తీసింది..!

అవును ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన చివరి పాట ఆయన అభిమానులతో ఇప్పుడు కనీళ్ళు పెట్టిస్తుంది. వెన్నెల కంటి రాజేంద్ర ప్రసాద్ రచించిన ఈ పాటను ఇటీవల పాడారు బాలసుబ్రహ్మణ్యం. ‘కరోనా .. కరోనా … కరోనా ..ఎక్కడిది ఈ కరోనా .. ఏమిటి ఈ కరోనా .. కంటికి కనిపించని పెను శత్రువు ఈ కరోనా’ అంటూ ఈ లాక్ డౌన్ టైములో బాలు.. ఈ పాట పాడారు. ‘బహుశా ఈ పాట పాడేటప్పుడు ఆయన కూడా అనుకుని ఉండరేమో..

ఈ కరోనా మహమ్మారే ఈయన ప్రాణం తీస్తుందని’ అంటూ ప్రేక్షకులు గుర్తుచేసుకుని మరీ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఆగష్ట్ మొదటి వారంలో బాల సుబ్రహ్మణ్యం.. ‘నాకు కరోనా సోకిందని.. కంగారు పడాల్సింది ఏమీ లేదు.. అతి త్వరలోనే దీని నుండీ కోలుకుని మిమ్మల్ని కలుస్తాను’ అని చెప్పారు. అయితే తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోతారని కలలో కూడా ఎవ్వరూ ఊహించి ఉండరు. ఇదిలా ఉండగా.. సినిమాల పరంగా ‘పలాస 1978’ చిత్రంలో ‘ఓ సొగసరి’

అనే పాటను బాల సుబ్రహ్మణ్యం గారు చివరిగా పాడినట్టు తెలుస్తుంది. లక్ష్మీ భూపాల్ ఈ పాటకు లిరిక్స్ అందించారు. రఘు కుంచె సంగీతంలో రూపొందిన ఈ పాటను… ఎస్పీ బాలు, బేబి కలిసి పట్టినట్టు తెలుస్తుంది.

బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus