స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మొదటి సారి నటించిన ఫ్యాన్ ఇండియా మూవీ పుష్ప డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమాపై అంచనాలు అయితే గట్టిగానే ఉన్నాయి. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంటుందని కూడా ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. రెండు రోజుల క్రితం ఆన్లైన్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవ్వగా దాదాపు 95% థియేటర్స్ హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.
అంతేకాకుండా యూఎస్ లో కూడా ఈ సినిమాకు ఓపెనింగ్స్ బాగానే వస్తాయని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఆ అవకాశం లేన్నట్లు తెలుస్తోంది. సినిమాకు ఓవర్సీస్ లో కూడా మంచి మార్కెట్ అయితే ఉంది. కానీ అక్కడ అదే సమయంలో స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ అనే మరో సీరీస్ కూడా విడుదల కాబోతోంది. డిసెంబర్ 16న విడుదల కాబోయే ఆ హాలీవుడ్ సినిమాకి అమెరికాలో అయితే భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందే అవకాశం ఉంది.
క్రిస్మస్ సెలవులు ఉంటాయి కాబట్టి దాదాపు అన్ని ఏరియాల్లో స్పైడర్ మాన్ డామినేషన్ ఎక్కువగానే ఉంటుంది. తెలుగు ప్రేక్షకులలో చిన్న పిల్లలు కూడా ఆట వైపు తిరిగే అవకాశం ఉంటుంది. ఏదేమైనా కూడా సినిమా ఓవర్సీస్లో మాత్రం కొంత రాంగ్ టైమ్ లోనే వస్తున్నట్లు తెలుస్తోంది. స్పైడర్ మాన్ సినిమా ప్రపంచం వ్యాప్తంగా భారీ స్థాయిలో అభిమానులు ఉన్నారు కాబట్టి పుష్ప సినిమా పై తప్పకుండా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది.
ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే ఓపెనింగ్స్ మాత్రం గట్టిగా వస్తాయి అని చెప్పవచ్చు. నార్త్ లో అయితే నమ్మకం లేదు అనిపిస్తుంది. ఇప్పటివరకు సభ్యులు అటువైపు పెద్దగా ప్రాముఖ్యత చూపింది లేదు లేదు. ఇక మలయాళం కన్నడలో బన్నీకి మంచి మార్కెట్ ఉంది కాబట్టి అక్కడ డౌట్ లేదు. ఇక తమిళ్ లో ఈ సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.