మొన్నీమధ్యన అనుకుంటా… ప్రభాస్ సినిమాల లైనప్ గురించి ఓ వార్త వచ్చింది. ఎలా వచ్చింది, ఎవరు చెప్పారు అనే విషయం పక్కనపెడితే… అదే నిజమైతే ‘స్పిరిట్’ సినిమా 2024లో వచ్చేస్తుంది. వినడానికి చాలా బాగున్నా… నమ్మడానికి ఈ విషయం చాలా కష్టం. ఎందుకంటే అంత త్వరగా కథను ఓకే చేసి, పట్టాలెక్కించే రకం కాదు ఆ సినిమా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. తాజాగా ఆయనే ‘స్పిరిట్’ సినిమా గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. దీంతో ఇప్పుడు ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి.
సినిమా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మాటల ప్రకారం చూస్తుంటే సినిమా అక్టోబర్ 2024లో ప్రారంభమవుతుంది. ఈ లోపు ప్రభాస్ తన సినిమాలన్నీ పూర్తి చేసుకుంటాడట. అక్టోబరు నుండి సినిమాను ఏకధాటిగా చిత్రీకరణ జరిపి ఏడాదిలో ఫైనల్ కాపీ సిద్ధం చేసే ఆలోచనలో ఉన్నారట. అలా అన్నీ అనుకున్నట్లుగా జరిగితే 2025 ఆఖరులో కానీ, 2026 ప్రారంభంలో కానీ సినిమా విడుదలయ్యే అవకాశం ఉందట. అయితే వరుసగా చిత్రీకరణ జరపడం ప్రభాస్ స్టైల్‌లో లేదు. తరచూ బ్రేక్స్ ఉంటూ ఉంటాయి.
ఇక ఈ సినిమా గురించి ఇటీవల సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ ‘యానిమల్’ సినిమాను మించిన ‘స్పిరిట్’ సినిమాలో ఉంటుంది ఉన్నారు. ‘స్పిరిట్’ సినిమాలో భయమే లేని కరుడు గట్టిన పోలీస్ ఆఫీసర్ కథను చూపిస్తారట. ప్రభాస్‌ను అంతకుమించి అనే రేంజిలో ఈ సినిమాలో చూపిస్తారట. ముంబయిలోని స్పిరిట్ (Spirit) మాఫియాను ఈ సినిమాలో చూపిస్తారు అని ఇప్పటికే చెప్పేశారు సందీప్ రెడ్డి వంగా.
స్క్రిప్ట్ ఏ దశలో ఉందో ఇంకా తెలియదు కానీ… కథ, కథనంలో వయెలెన్స్ పాళ్లు భారీగా ఉన్నాయి అని చెబుతున్నారు. ‘బాహుబలి’ సినిమాల తర్వాత ప్రభాస్‌ను ఆ స్థాయిలో చూపించిన దర్శకులు ఎవరూ లేరు అని చెప్పాలి. ‘సాహో’ సినిమా తీసిన సుజీత్ ఒక్కరే బెటర్. మిగిలిన రాధకృష్ణ, ఓం రౌత్ సరిగ్గా ప్రభాస్‌ను మాస్ మేనియాను చూపించలేకపోయారు. మరిప్పుడు సందీప్ రెడ్డి వంగా ఏం చేస్తారో చూడాలి. ఇక ‘సలార్’ సినిమాలతో ప్రశాంత్ నీల్ మాస్ ఫెస్టివల్ చూపిస్తాడు అని కచ్చితంగా చెప్పేయొచ్చు.
ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!
కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!