సినిమా, స్పోర్ట్స్ ఎప్పుడూ ఇంట్రెస్టింగ్‌గా ఉండేవే. మన తెలుగు ప్రేక్షకులు, జనాలు ఈ రెండింటినీ తెగ చూస్తారు. అయితే ఈ రెండూ కలిపితే మాత్రం అంతగా ఆదరించరు. చాలా రోజులుగా నిరూపితం అవుతూ వస్తున్న ఈ విషయం మరోసారి ‘లైగర్’తో వెలుగులోకి వచ్చింది. తెలుగులో స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ సినిమాలకు ఆశించినంత మేర విజయాలు దక్కడం లేదు. దీంతో టాలీవుడ్‌కి, స్పోర్ట్స్‌కి పడదా అంటూ సరదాగా జోక్స్ వేస్తున్నారు. ఇటీవల గత కొన్ని నెలలుగా చూస్తుంటే టాలీవుడ్‌లో వరుసగా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ సినిమాలు వస్తున్నాయి.
అయితే అదే రీతిలో వెనక్కి వెళ్లిపోతున్నాయి. వరుణ్‌తేజ్ ఎంతో నమ్మకంగా చేసిన సినిమా ‘గని’. ఈ సినిమా భారీ అంచనాలతో వాయిదాలు పడుతూ పడుతూ విడుదలై దారుణమైన ఫలితాన్ని అందుకుంది. ఆ సమయంలో నాగశౌర్య సినిమా ‘లక్ష్య’ కూడా వచ్చింది. ఈ సినిమా ఆర్చరీ నేపథ్యంలో రూపొందింది. నాగశౌర్య ఎంతో నమ్మకంగా చేసిన ఈ సినిమా కూడా తేడా కొట్టింది. ఆ తర్వాత కీర్తి సురేశ్‌తో నగేశ్ కుకునూర్ తెరకెక్కించిన ‘గుడ్ లక్ సఖి’ విడుదలైంది.
అయితే ప్రేక్షకులు మాత్రం బ్యాడ్‌లక్ అంటూ వెనక్కి పంపించేశారు. వరుస వాయిదాలతో వచ్చిన ఈ సినిమా కూడా ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కిన ‘లైగర్’ పరిస్థితీ ఇంతే. ప్రేక్షకుల అంచనాల్ని అందుకోవడంలో పూర్తి స్థాయిలో ఈ సినిమా విఫలమైంది. దీంతో టాలీవుడ్‌కి, స్పోర్ట్స్‌కి లింక్ పెట్టాలంటే మన దర్శకులు భయపడుతున్నారు.
ఇలాంటి స్పోర్ట్స్ సినిమాలకు గతంలో బాలీవుడ్‌లో అయితే విజయాల శాతం బాగానే ఉండటం గమనార్హం. కానీ ఇటీవల కాలంలో అక్కడ కూడా తుస్ మంటున్నాయి. భారత ప్రముఖ క్రికెటర్ మిథాలీ రాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘శభాష్ మిథు’కే విజయం దక్కలేదు. దీంతో స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో విజయం అనే పాత లెక్క మిథ్యగా మారిపోయింది. మన దర్శకులు ఈ దిశగా ఆలోచిస్తే విజయాలు సాధించొచ్చు. లేదంటే పరాజయాలు ఇంకా పలకరిస్తూ ఉంటాయి.
Most Recommended Video
‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!