Iswarya Menon: ఇంటర్వ్యూ: ‘స్పై’ గురించి హీరోయిన్ ఐశ్వర్య మీనన్ చెప్పిన ఆసక్తికర విషయాలు

‘కార్తికేయ 2’ తో పాన్ ఇండియా హీరో అయిపోయాడు నిఖిల్. త్వరలో మరో పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అదే ‘స్పై’. ఎడిటర్ గ్యారీ బిహెచ్ దర్శకుడిగా మారుతూ చేసిన ఈ సినిమాని ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై కె రాజశేఖ‌ర్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్ లభించింది. జూన్ 29న విడుదల కాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ కొన్ని చోట్ల ఓపెన్ అవ్వగా.. క్షణాల్లో అవి ఫిల్ అయిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన ఐశ్వర్య మీనన్.. స్పై గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది. అవి మీ కోసం :

ప్ర) తెలుగులో మీకు ఇదే మొదటి సినిమా కదా?

ఐశ్వర్య మీనన్ : అవును హీరోయిన్ గా ఇది నా (Iswarya Menon) డెబ్యూ మూవీ. అయితే 2012లో వచ్చిన సిద్దార్థ్ ‘లవ్ ఫెయిల్యూర్’ లో చిన్న అతిధి పాత్రలో నటించాను.

ప్ర) మీ నేపథ్యం ఏంటి.. సినిమాల్లోకి ఎలా ఎంట్రీ ఇచ్చారు?

ఐశ్వర్య మీనన్ : నేను ఇంజనీరింగ్ చేశాను. హీరోయిన్ అవుతానని ఎప్పుడూ అనుకోలేదు. కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న యాడ్స్ చేశాను.మలయాళ, తమిళ సినిమాల్లో నటించే ఛాన్స్ లు వచ్చాయి. ఒక్కొక్క అడుగు వేసి ఈరోజు ఇలా హీరోయిన్ గా నిలబడ్డాను. ఇది నాకు సంతృప్తికరంగానే ఉంది.

ప్ర)’స్పై’ లోకి ఎలా ఎంట్రీ ఇచ్చారు?

ఐశ్వర్య మీనన్ : ఇందాక చెప్పుకున్నట్టు ఇది నా తెలుగు డెబ్యూ మూవీ. నిజంగా ఇది నా డ్రీమ్ డెబ్యు. దర్శకుడు గ్యారీ బి హెచ్ ఈ సినిమాకు సైన్ చేసినపుడే నన్ను హీరోయిన్ గా అనుకున్నారట. నేరుగా వచ్చి నాకు కథ చెప్పారు. కథ విన్న వెంటనే థ్రిల్ అయిపోయాను. నా రోల్ చాలా ఇంటెన్సిటీతో కూడుకుని ఉంటుంది. మరో ఆలోచన లేకుండా సైన్ చేసేశాను. ఇలాంటి గొప్ప సినిమాలో నటించే ఛాన్స్ ఇంత త్వరగా వస్తుందని ఊహించలేదు.

ప్ర)’స్పై’ ఎలా ఉండబోతుంది?

ఐశ్వర్య మీనన్ : స్పై .. ఎక్సైటింగ్ యాక్షన్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. కేవలం యాక్షన్ ప్రియులకి మాత్రమే కాకుండా అందరికీ ఈ సినిమా నచ్చుతుంది. ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉన్నాయి. లవ్ స్టోరీ ఉంది. సెంటిమెంట్ ఉంది. ఇలా అన్నీ ఉన్నాయి.

ప్ర)’స్పై’ లో మీ పాత్ర ఎలా ఉండబోతుంది?

ఐశ్వర్య మీనన్ : నా పాత్రకు చాలా షేడ్స్ ఉన్నాయి. యాక్షన్, స్టంట్స్ అన్నీ చేశాను. రా ఏజెంట్ గా కనిపించడానికి స్పెషల్ గా యాక్షన్, గన్ షూటింగ్ కోసం 6 నెలలు ట్రైనింగ్ తీసుకున్నాను.

ప్ర)నిఖిల్ తో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది?

ఐశ్వర్య మీనన్ : నిఖిల్ (Nikhil) బ్రిలియంట్ యాక్టర్. హ్యాపీ డేస్ నుండి అతని సినిమాలు చూస్తూనే ఉన్నాను. ‘స్వామి రారా’ ‘కార్తికేయ’ నాకు చాలా ఇష్టం. అతని స్టోరీ సెలక్షన్ బాగుంటుంది. అలాగే అతను చాలా పాజిటివ్ పర్సన్ . చాలా ఎనర్జిటిక్ గా ఉంటాడు.

ప్ర)’స్పై’ లో మీకు ఛాలెంజింగ్ గా అనిపించిందేంటి?

ఐశ్వర్య మీనన్ : నేను చేసిన మొదటి యాక్షన్ మూవీ ఇది. అంతకు ముందు యాక్షన్ జోలికి పోలేదు. రా ఏజెంట్ గా కనిపించడం అంటే అంత ఈజీ కాదు. ఇన్స్టెంట్ గా రియాక్ట్ అయ్యేలా కనిపించాలి. దానికి లుక్స్ నార్మల్ గా ఇస్తే సరిపోదు. ఒరిజినల్ గన్స్ చాలా బరువుగా ఉంటాయని.. ఈ సినిమా చేసే వరకు తెలీదు (నవ్వుతూ)

ప్ర)’స్పై’ మ్యూజిక్ డైరెక్టర్స్ గురించి చెప్పండి ?

ఐశ్వర్య మీనన్ : శ్రీచరణ్ పాకాల గారు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు అలాగే.. ‘తూ ముజే ఖూన్ ధో’ పాటని కంపోజ్ చేశారు, ఇక విశాల్ చంద్రశేఖర్ గారు రెండు పాటలు చేశారు. ‘జూమ్ జూమ్’ రేకి ఎక్స్ట్రార్డినరీ రెస్పాన్స్ లభించింది.

ప్ర)నిర్మాత గురించి చెప్పండి?

ఐశ్వర్య మీనన్ : సినిమా ఇంత క్వాలిటీగా వచ్చింది అంటే.. అది రాజశేఖ‌ర్ రెడ్డి గారి ఎంకరేజ్మెంట్ వల్లే అని చెప్పాలి. ఆయనకు సినిమా పై ఉన్న ప్యాషన్ అలాంటిది. ఇలాంటి నిర్మాత బాగుంటే ‘స్పై’ లాంటి మంచి సినిమాలు మరెన్నో వస్తాయి.

ప్ర)’స్పై 2′ ఉంటుంది అంటున్నారు.. నిజమేనా?

ఐశ్వర్య మీనన్ : స్పై కి పార్ట్ 2 చేసే స్కోప్ ఉంది. అందులోనూ నేనే హీరోయిన్ గా ఉండాలనేది నా కోరిక(నవ్వుతూ)

ప్ర)మీ డ్రీమ్ రోల్స్ ఏమైనా ఉన్నాయా?

ఐశ్వర్య మీనన్ : ఉన్నాయి. అలియా భట్ చేసిన ‘హైవే’ లాంటి పాత్రలు చేయాలనేది నా డ్రీం.

ప్ర)తెలుగులో ఇంకేమైనా సినిమాని ఓకే చేశారా?

ఐశ్వర్య మీనన్ : ఎస్.. ‘యూవీ క్రియేషన్స్’ లో కార్తికేయ హీరోగా నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా చేస్తున్నాను. తమిళ్ లో కానీ, మలయాళంలో కానీ ఇంకా ఏ సినిమా ఓకే అవ్వలేదు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus