బాహుబలి ప్రభావం ప్రేక్షకులపై ఎంత ఉందో తెలియదు గానీ .. ఆ మూవీ కలక్షన్స్ ప్రభావం సినీ స్టార్స్ పై గట్టిగానే ఉంది. అందుకే ఏక కాలంలో రెండు, మూడు భాషల్లో తెరకెక్కిస్తున్నారు. మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న స్పైడర్ తెలుగు, తమిళ భాషల్లో రూపుదిద్దుకుంటోంది. అంతేకాదు మరో రెండు భాషల్లో డబ్బింగ్ కూడా జరుపుకుంటోంది. హిందీ, మలయాళంలోనూ ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనీ చిత్ర బృందం భావిస్తోంది. అందుకు తగ్గట్టు పనులను కూడా ప్రారంభించినట్టు సమాచారం. ఒకేసారి నాలుగు భాషల్లో రిలీజ్ చేసి కలక్షన్స్ పరంగా రికార్డు సృష్టించడానికి మురుగదాస్ ప్లాన్ వేశారు. అందుకు మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో డబ్బింగ్ పనులు జోరందుకుంది.
ఠాగూర్ మధు సమర్పణలో ఎన్.వి.ఆర్. సినిమా, ఎల్ఎల్పి, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై ఎన్.వి.ప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీలో ఇంటెలిజన్స్ ఆఫీసర్ గా ప్రిన్స్ , హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్, విలన్ గా ఎస్.జె.సూర్య నటిస్తున్నారు. ప్రస్తుతం మహేష్, రకుల్ పై ఓ రొమాంటిక్ పాటను మురుగదాస్ చిత్రీకరిస్తున్నారు. మరో పాట షూటింగ్ తో ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అవుతుంది. సెప్టెంబర్ 27 న నాలుగు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. హరీష్ జయరాజ్ సంగీతాన్నిఅందిస్తున్న ఈ సినిమాని హిందీలో కరణ్ జోహార్ అత్యంత భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు మొదలెట్టినట్టు సమాచారం.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.