Squid Game 3: బ్లాక్‌బస్టర్‌ సూపర్‌ హిట్‌ వెబ్‌ సిరీస్‌ సీక్వెల్‌.. స్ట్రీమింగ్ డేట్‌ ఇదే!

చిన్న ప్రాజెక్టులే చెప్పిన టైమ్‌కి సినిమా లేదా వెబ్‌సిరీస్‌ను రిలీజ్‌ చేయలేకపోతున్న రోజులివి. కారణాలేమైనా ప్రాజెక్ట్‌ అయితే రావడం లేదు. ఇలాంటి సమయంలో ఓ భారీ ప్రాజెక్టు, అందులోనూ భారీ ఆదరణ దక్కించుకున్న వెబ్‌ సిరీస్‌ను టైమ్‌కి అదీనూ చెప్పిన సమయానికి తీసుకురావడం పెద్ద విషయమే. ఇప్పుడు అదే పని చేసి చూపిస్తున్నారు ‘స్క్విడ్‌ గేమ్‌’ వెబ్‌ సిరీస్‌ టీమ్‌.

Squid Game 3

నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమ్‌ అయ్యి మంచి ఆదరణ సొంతం చేసుకుందీ వెబ్‌ సిరీస్‌. ఇప్పటికే దీని రెండు సీజన్‌లతో విశేష ప్రేక్షకాదరణను సొంతం చేసుకున్న ఈ సిరీస్‌ మూడో సీజన్‌ వచ్చేస్తోంది. అవును.. రెండో ‘స్క్విడ్‌ గేమ్‌’ విడుదల సమయంలో టీమ్‌ చెప్పినట్లుగానే ‘స్క్విడ్‌ గేమ్‌ 3’ని ఎర్లీగానే తీసుకొచ్చేస్తున్నారు. ఈ సిరీస్‌ టీజర్‌ను తాజాగా విడుదల చేశారు.

జూన్‌ 27 నుంచి కొరియన్‌ థ్రిల్లర్‌ మూడో సీజన్‌ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌కి రానున్నట్లు టీమ్‌ తెలిపింది. ఇక ఈ సిరీస్‌ సంగతులు చూస్తే.. ‘స్క్విడ్‌గేమ్ 2021లో విడుదలై రికార్డులు సృష్టించింది. అవార్డులను కూడా అందుకుంది. గతేడాది ఆఖరులో రెండో సీజన్‌ విడుదలైంది. ఇది కూడా ఆదరణ పొందింది. ఇక ఈ సిరీస్‌ కథ గురించి చూస్తే.. జీవితంలో సర్వస్వం కోల్పోయి, అప్పులపాలైన 456 మందిని ఒక రహస్య దీవికి తీసుకెళ్తారు. అక్కడ రెడ్‌ లైట్‌ – గ్రీన్‌ లైట్‌, గోలీలాట, టగ్ ఆఫ్‌ వార్‌ లాంటి చిన్న పిల్లలు ఆడుకునే ఆటల పోటీలు నిర్వహిస్తారు.

వీటిలో విజేతలుగా నిలిచిన వారు 45.6 బిలియన్ కొరియన్ వన్ (39 మిలియన్ డాలర్లు) గెలుచుకోవచ్చని చెబుతారు. ఆటలు ఈజీనే కదా అని అందరూ ఓకే చేస్తారు. కానీ ఓడిపోయినవారిని చంపేస్తారని తెలుస్తుంది. అయితే ఈ విషయంలో మొదటి ఆట ఆడితే కానీ తెలియదు. ఇలాంటి ప్రాణాంతకమైన ఆరు ఆటలను దిగ్విజయంగా పూర్తిచేసుకొని ఎవరు ప్రైజ్‌మనీ గెలుచుకున్నారు అనేదే వెబ్‌ సిరీస్‌.

బ్లాక్‌బస్టర్‌ సూపర్‌ హిట్‌ వెబ్‌ సిరీస్‌ సీక్వెల్‌.. స్ట్రీమింగ్ డేట్‌ ఇదే!

 

Read Today's Latest Videos Update. Get Filmy News LIVE Updates on FilmyFocus