2023 Rewind: గత ఏడాది రీ ఎంట్రీ ఇచ్చిన సీనియర్ భామలు.. ఎంతమంది సక్సెస్ అయ్యారంటే?

2023 కంప్లీట్ అయ్యింది. ఆ ఏడాది ఎంతో మంది హీరోయిన్ లు టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చారు. అందులో కొందరు సక్సెస్ అయ్యారు. అయితే అదే ఏడాది కొంతమంది సీనియర్ హీరోయిన్ లు, నటీమణులు కూడా రీ ఎంట్రీ ఇచ్చారు. కానీ వారిలో కూడా సక్సెస్ అయిన వారు తక్కువ. సరే ఇక లేట్ చేయకుండా 2023 లో రీ ఎంట్రీ ఇచ్చిన సీనియర్ హీరోయిన్ లు ఎవరో ఒకసారి చూద్దాం రండి:

1) సదా :

రానా తమ్ముడు, స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు చిన్న కొడుకు అయిన అభిరామ్ దగ్గుబాటి హీరోగా ఎంట్రీ ఇచ్చిన అహింస అనే సినిమాతో సదా రీ ఎంట్రీ ఇచ్చింది. ఆమెను హీరోయిన్ గా టాలీవుడ్ కి తెచ్చిన దర్శకుడు తేజనే ఈ సినిమాకి దర్శకుడు. ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. తర్వాత ఈమె ఆదికేశవ సినిమాలో కూడా నటించింది అది కూడా ఫ్లాప్ అయ్యింది

2) మీరా జాస్మిన్ :

విమానం అనే సినిమాతో టాలీవుడ్ కి రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. ఈమె రీ ఎంట్రీకి సరైన బ్రేక్ రాలేదు.

3) రేణు దేశాయ్ :

రవితేజ హీరోగా నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమాతో ఈమె రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా సక్సెస్ కాలేదు.

4) హనీ రోజ్ :

గతంలో ఆలయం, ఈ వర్షం సాక్షిగా వంటి సినిమాల్లో నటించిన హనీ రోజ్ , బాలకృష్ణ ‘ వీరసింహారెడ్డి’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈమె పాత్రకు కూడా మంచి మార్కులు పడ్డాయి

5) వాసుకి ఆనంద్:

నందినీ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన అన్నీ మంచి శకునములే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. గతంలో తొలి ప్రేమ లో పవన్ కళ్యాణ్ చెల్లెలిగా నటించిన ఈమె పలు సీరియల్స్ లో హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. కాని ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది.

6) వనిత విజయ్ కుమార్ :

నరేష్, పవిత్ర ..ల బయోపిక్ లాంటి మళ్ళీ పెళ్లి అనే సినిమాతో ఈమె రీ ఎంట్రీ ఇచ్చింది. గతంలో ఈమె దేవి అనే సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది

7) రిచా పన్నై:

నీలకంఠ దర్శకత్వంలో రూపొందిన సర్కిల్ అనే సినిమాతో ఈమె రీ ఎంట్రీ ఇచ్చింది. గతంలో ఈమె అల్లరి నరేష్ నటించిన యముడికి మొగుడు సినిమాలో హీరోయిన్ గా నటించింది

8) విమలా రామన్:

జగపతిబాబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన రుద్రంగి అనే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది విమలా రామన్. ఈ సినిమా బాగానే ఆడింది.

9) మమతా మోహన్ దాస్ :

జగపతిబాబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన రుద్రంగి అనే సినిమాతోనే ఈమె కూడా రీ ఎంట్రీ ఇచ్చింది.

10) నేహా శర్మ:

చిరుత హీరోయిన్ (Neha Sharna) చాలా కాలం తర్వాత నాని హాయ్ నాన్న సినిమాలో జస్ట్ అలా కనిపించి మాయమైపోయింది

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus