యూత్ కి బాగా కనెక్ట్ అయ్యింది భయ్యా..!

SR కళ్యాణ మండపం 1975 సినిమా టైటిల్ పేరు వెరైటీగా ఉన్నా, లాక్డౌన్ కరోనా టైమ్ లో వచ్చిన సాంగ్స్ యూత్ కి బాగా కనెక్ట్ అయ్యాయి. ముఖ్యంగా చూశానే కళ్యారా, చుక్కల చున్నీ అనే సాంగ్స్ మిలియన్స్ లో చూశారు. ‘రాజావారు రాణిగారు’ ఫేమ్‌ కిరణ్‌ అబ్బవరం హీరోగా, టాక్సీవాలా ఫేమ్ ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా చేస్తున్న ఈసినిమాకి సంబంధించిన ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఇలా రిలీజ్ చేశారో లేదో అలా ట్రెండింగ్ అయ్యిపోయింది ఈ ట్రైలర్. యూత్ కి బాగా కనెక్ట్ అయ్యేలా డైలాగ్స్ ఇందులో ఉన్నాయి.

ముఖ్యంగా సాయికుమార్ కొడుకుగా హీరో తన మార్క్ యాక్టింగ్ ని చూపిస్తున్నాడు. ప్రతోడికి నా గర్ల్ ప్రెండ్ నడుం గురించేనా పంచాయితీ అంటూ హీరో చెప్పే మాస్ డైలాగ్స్, “కుక్కలాగైనా నన్ను చూస్కో.. నీ ఒళ్లో పండబెట్టుకో, నా బొచ్చు నిమురు, అప్పుడప్పుడు రెండు చెంపలకి ముద్దులివ్వూ కుక్కలాగానే చూస్కోవే” అంటూ రెచ్చిపోతున్నాడు హీరో. హీరో తండ్రి పాత్రలో సాయికుమార్ క్యారెక్టర్ హైలెట్ గా ఉండబోతోంది. సీమ యాసలో తనదైన మార్క్ ని చూపిస్తున్నాడు సాయికుమార్. అంతేకాదు, హీరోయిజాన్ని చూపిస్తూనే సినిమాలో ఉన్న కంటెంట్ ని కూడా ట్రైలర్ లో చూపించారు.

ఎస్ ఆర్ కళ్యాణమండపం పెట్టిన తర్వాత హీరోకి ఎదురయ్యే ప్రాబ్లమ్స్ ఏంటి..? తన ప్రేమని దక్కించుకున్నాడా లేదా అనేది సినిమాలో ఆసక్తికరంగా ఉండబోతోంది. ముఖ్యంగా సినిమా ట్రైలర్ యూత్ కి బాగా కనెక్ట్ అవుతోందనే చెప్పాలి. చిన్న బడ్జెట్ సినిమాలాగా ఎక్కడా కూడా అనిపించడం లేదు. పెద్ద హీరోకి ఉండే ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ కూడా ఈ సినిమాలో కనిపిస్తున్నాయి. ఈ సమ్మర్ కి ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు. ఓవర్ ఆల్ గా ట్రైలర్ ఇప్పుడు ట్రెండింగ్ లో అంద్రనీ ఆకట్టుకుంటోంది.


30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus