యాంకర్ శ్రీముఖి గురించి అందరికి తెలుసు.. బుల్లితెర రాములమ్మగా అందరిని తన మాటలతో ఆకట్టుకుంటుంది.. ఈ మధ్య యాంకరింగ్ లో బోల్డ్ నెస్ పెంచడంతో పాటు గ్లామర్ డోస్ కూడా పెంచేసింది.. సోషల్ మీడియాలో ఎంత ఫాలోయింగ్ ఉందో అందరికి తెలిసిందే.. హాట్ అందాలతో గ్లామర్ ట్రీట్ ఇస్తుంది.. ఎప్పటికప్పుడు ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాళ్లకు సెగలు పుట్టిస్తుంది.. తాజాగా ఈ అమ్మడు పెళ్లి కూతురుగా రెడీ అయ్యింది అందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. ఆ ఫోటోలను చూసి అందరూ షాక్ అవుతున్నారు ..
పెళ్ళికొడుకు ఎవరనే చర్చలు జరుగుతున్నాయి..నిజమా అనే చర్చలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.. శ్రీముఖి పెళ్లి అంటూ తరచుగా వార్తలు వస్తుంటాయి. ఈ వార్తలను పలుమార్లు శ్రీముఖి ఖండించారు. ప్రస్తుతం నా దృష్టి కెరీర్ మీదే, పెళ్లి ఆలోచన లేదని చెప్పారు. అలాగే నిరాధార కథనాలపై మండిపడ్డారు. ఆ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాను, తప్పుడు వార్తలు రాయొద్దని ఆమె హితవు పలికారు.. ప్రస్తుతం శ్రీముఖి పెళ్లి కూతురు గెటప్ వైరల్ అవుతుంది. మరోవైపు యాంకర్ గా జెట్ స్పీడ్ తో దూసుకుపోతుంది.
శ్రీముఖి (Sree Mukhi) సంపాదన కోట్లకు చేరిన నేపథ్యంలో ఇటీవల లగ్జరీ హౌస్ నిర్మించుకున్నారు. హైదరాబాద్ లో సొంతింటి కల నెరవేర్చుకున్నారు. నటిగా, యాంకర్ గా ఆమె దూసుకు పోతుంది.. కొత్తగా స్టార్ మాలో మొదలైన బీబీ జోడి డాన్స్ రియాలిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ విషయంలో సుమ, రష్మీలను కూడా శ్రీముఖి అధిగమించారనిపిస్తుంది.. యాంకర్ గా అవకాశాలు వస్తున్నప్పటికీ వెండితెరపై కూడా రాణించాలని ఆమె కోరుకుంటుంది. దానిలో భాగంగా… క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటుంది.
క్రేజీ అంకుల్స్ మూవీలో శ్రీముఖి హీరోయిన్ గా నటించారు. . అనసూయ, రష్మీ మాదిరి నటిగా బిజీ కావాలని కోరుకుంటున్నారు…ప్రస్తుతం ఈ అమ్మడు చిరంజీవి భోళా శంకర్, బాలకృష్ణ-అనిల్ రావిపూడి చిత్రాల్లో శ్రీముఖి నటిస్తున్నారట. భోళా శంకర్ లో మెగాస్టార్ తో ఆమెకు రొమాంటిక్ సన్నివేశాలు ఉన్నాయనే ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతుంది..అలాగే బాలయ్య 108వ చిత్రంలో కూడా శ్రీముఖి కీలక రోల్ చేస్తున్నారట. ఈ మేరకు టాలీవుడ్ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
క్రేజీ అంకుల్స్ మూవీతో శ్రీముఖి హీరోయిన్ అవతారం ఎత్తిన విషయం తెలిసిందే.. ఇంకా కొన్ని ప్రాజెక్ట్ లలో నటిస్తుంది.. ఇలా ఈ ఫోటోలు వైరల్ కావడంతో శ్రీముఖి ఏంటి ఇలా తయారయ్యారు అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.అయితే ఈమె ఏదైనా షో నిమిత్తం ఇలా పెళ్లికూతురుగా ముస్తాబయ్యారా. లేక మరేదైనా కారణం ఉందా అంటూ సందేహాలను వ్యక్తపరుస్తున్నారు.
More…
విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?
శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?