Sree Vishnu: శ్రీవిష్ణు మరో హిట్టు కొట్టేలా ఉన్నాడే..!

శ్రీవిష్ణు.. కెరీర్ ప్రారంభం నుండీ వైవిధ్యమైన సినిమాలను చేస్తూ వరుస విజయాలను అందుకుంటున్నాడు.ఈ ఏడాది ఆల్రెడీ ‘రాజ రాజ చోర’ తో హిట్ అందుకున్న శ్రీవిష్ణు… త్వరలో ‘అర్జున … ఫల్గుణ’ అంటూ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. చిరంజీవితో ‘ఆచార్య’ వంటి బడా చిత్రాన్ని నిర్మిస్తున్న ‘మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్’ వారు ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నారు.’జోహార్’ అనే విభిన్న కథా చిత్రాన్ని తెరకెక్కించిన తేజ మర్నీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు.’నాది కానీ కురుక్షేత్రంలో నాకు తెలియని పద్మ వ్యూహంలో ఇరుక్కుపోయాను. అయినా బలైపోవడానికి నేను అభిమన్యుడ్ని కాదు అర్జునుడిని’ అంటూ శ్రీవిష్ణు చెప్పే డైలాగ్ తో టీజర్ మొదలైంది.సంగీత దర్శకుడు ప్రియదర్శన్ బాలసుబ్రమణ్యన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకునే విధంగా ఉంది. ‘రెడ్’ ఫేమ్ అమ్రిత అయ్యర్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుండగా మహేష్ ఆచంట, సుబ్బరాజు వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

యాక్షన్, ఎమోషన్.. ఎలిమెంట్స్ తో ఈ టీజర్ ఉంది. ఒరిస్సా నేపధ్యంలో ఈ చిత్రం కథ సాగుతుందనే హింట్ ఇచ్చారు. ‘అర్జున ఫల్గుణ’ టీజర్ ఆసక్తికరంగానే ఉంది. మీరు కూడా ఓ లుక్కేయండి :

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!


రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus