Sreeja, Surekha: సురేఖ చిరంజీవి చేసే పనులపై శ్రీజ అసహనం… ఎందుకంటే?

చిరంజీవి చిన్న కూతురు శ్రీజ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తన గురించి, తన సరదాల గురించి, తన ట్రిప్పుల గురించి వరుస అప్‌డేట్స్‌ ఇస్తూ ఉంటుంది. ఈ క్రమంలో కొన్ని ఆసక్తికర అంశాలు తెలుస్తుంటాయి. తాజాగా ఆమె సురేఖ చిరంజీవి గురించి చేసిన ఓ పోస్ట్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అంతలా ఏముంది అనుకుంటున్నారా? ప్రతి తల్లి తన బిడ్డ భోజనం విషయంలో తీసుకున్న జాగ్రత్తనే. కావాలంటే ఈ వార్త పూర్తయ్యేలోపు మీకు కూడా ఇదే అనిపిస్తుంది.

శ్రీజ పోస్ట్‌ చేసిన కొత్త పోస్ట్‌ చూస్తే… అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో మరోసారి అర్థమవుతుది. మనం తినడానికి ఒకటి అడిగితే నాలుగైదు రకాలుగా వండి పెడుతుంటుంది అమ్మ. ఇప్పుడు శ్రీజకు కూడా అదే జరిగింది. ఆ విషయాన్నే చెప్పింది శ్రీజ. ‘అమ్మను నేను బ్రేక్‌ఫాస్ట్‌ కోసం బాక్స్‌లో ఎగ్స్ పెట్టమని చెప్పాను. తీరా చూస్తే… ఇదిగో ఇన్ని ఐటెమ్స్‌ పెట్టింది’ అంటూ ఓ పొటో పోస్ట్‌ చేసింది. ఎగ్స్‌ అడిగిన శ్రీజకు సురేఖ.. ఏకంగా మూడు వెరైటీస్‌ పెట్టడం గమనార్హం.

శ్రీజ షేర్‌ చేసిన ఫొటో బట్టి చూస్తే… ఆమె ఎక్కడికో ట్రిప్‌కు వెళ్తూ సురేఖను బ్రేక్‌ఫాస్ట్‌లోనో, బ్రంచ్‌లోనే ఎగ్స్‌ మాత్రమే పెట్టమని చెప్పింది. అయితే తల్లి ప్రేమ కదా… ఎగ్‌ ఆమ్లెట్‌, బ్రెడ్‌, ఇడ్లీ విత్‌ చట్నీ చేసిచ్చారు. అందుకే మా అమ్మ నేను అడిగింది చేయకుండా ఇదిగో ఇలా చేస్తోంది అంటూ తన విసుగును సరదాగా ప్రదర్శించింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో రాసుకొచ్చింది. దీంతో నెటిజన్లు అమ్మ ప్రేమ అంతే మరి అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు.

ఇక శ్రీజ (Sreeja) విషయానికొస్తే… రెండో భర్త కల్యాణ్‌దేవ్‌ నుండి ఆమె దూరంగా ఉంటున్నారు. విడాకులు అనే పుకార్లు బయటకు వస్తున్నా దీనిపై క్లారిటీ రావడం లేదు. అయితే ఆమె వ్యాపార రంగంలోకి అడుగుపెట్టే ప్రయత్నాల్లో ఉన్నారనేది లేటెస్ట్‌ టాక్‌. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ వస్తుందట.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus