Sreeja: వైరల్ అవుతున్న శ్రీజ ఎమోషనల్ పోస్ట్!

చిరంజీవి చిన్న కూతురిగా శ్రీజకు ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యులంతా సినిమాలతో బిజీగా ఉన్నా శ్రీజ మాత్రం సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. కొన్నేళ్ల క్రితం కళ్యాణ్ దేవ్ ను శ్రీజ వివాహం చేసుకోగా శ్రీజ తాజాగా సోషల్ మీడియాలో తన పేరును మార్చుకోవడంతో ఆమె గురించి సోషల్ మీడియా వేదికగా జోరుగా చర్చ జరుగుతోంది. శ్రీజ కళ్యాణ్ దేవ్ విడిపోనున్నారని వార్తలు ప్రచారంలోకి వస్తున్నా అటు శ్రీజ కానీ ఇటు కళ్యాణ్ దేవ్ కానీ ఈ వార్తల గురించి స్పందించడానికి ఇష్టపడటం లేదు.

తాజాగా శ్రీజ ఎమోషనల్ పోస్ట్ చేయగా ఆ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. రామ్ చరణ్ తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసిన శ్రీజ “హగ్స్ అండ్ కడిల్స్.. నేను బ్రతకడానికి నాకు సంతోషంను ఇచ్చే చిన్నచిన్న విషయాలు ఇవే” అంటూ ఎమోషనల్ అయ్యారు. తాజాగా ముంబై వీధులలో శ్రీజ రామ్ చరణ్ తో కలిసి దిగిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అన్నాచెల్లెలు కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

అయితే ఏ కారణం వల్ల వీళ్లు ముంబైకు వచ్చారనే ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. మరోవైపు రామ్ చరణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా మార్చి 18 లేదా ఏప్రిల్ 28వ తేదీలలో థియేటర్లలో రిలీజ్ కానుంది. ఆచార్య సినిమా ఏప్రిల్ 1వ తేదీన రిలీజ్ కానుందని మేకర్స్ ప్రకటించారు. ఒకే నెలలో చరణ్ తను హీరోగా తెరకెక్కిన రెండు సినిమాలను రిలీజ్ చేస్తారేమో చూడాల్సి ఉంది.

చరణ్ శంకర్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతుండగా ఆ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. మరోవైపు చరణ్ నిర్మాతగా పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. నటుడిగా, నిర్మాతగా చరణ్ సక్సెస్ సాధించాలని ఈ స్టార్ హీరో అభిమానులు కోరుకుంటున్నారు.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus