Kalyaan Dhev: కళ్యాణ్ దేవ్ శ్రీజ కలిసి పోతున్నారా.. ఆ పోస్టుకు అర్థం అదేనా?

  • November 16, 2023 / 04:18 PM IST

మెగా డాటర్ శ్రీజ కళ్యాణ్ దేవ్ విడాకులు తీసుకుని గత కొంతకాలంగా వేరుగా ఉంటున్నారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ కనుక చూస్తుంటే వీళ్ళిద్దరూ కలిసిపోతున్నారా అన్న సందేహాలు రాకమానదు. శ్రీజకు దూరంగా ఉన్నటువంటి కళ్యాణ్ దేవ్ తరచూ సోషల్ మీడియా వేదికగా ఎన్నో పోస్టులు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఈయన చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ సందర్భంగా కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ..

ఒక గాయం మానడం అంటే అక్కడ జరిగిన డ్యామేజ్ మొత్తం సర్దుకొని పోయినట్లు కాదని అర్థం ఆ డామేజ్ ఇక జీవితాన్ని కంట్రోల్ చేయలేదన్నదే దాని అర్థమని ఉన్నటువంటి ఒక కొటేషన్ షేర్ చేశారు అయితే ఈయన షేర్ చేసిన ఈ కొటేషన్ చూస్తుంటే కనుక వీరి మధ్య వచ్చిన మనస్పర్ధలు పట్ల సర్దుకొని పోతూ తిరిగి కలసిపోయే ఆలోచనలో ఉన్నారా అంటూ పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఇదే కనుక నిజమైతే బాగుండు అని మెగా అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శ్రీజ కళ్యాణ్ దేవ్ ను రెండవ వివాహం చేసుకున్నారు. ఇదివరకే ఈమెకు వివాహం జరిగి ఒక కుమార్తె జన్మించారు అయితే తన భర్తతో వచ్చిన మనస్పర్ధలు కారణంగా ఈమె విడాకులు తీసుకుని విడిపోవడంతో చిరంజీవి స్వయంగా తనకు కళ్యాణ్ దేవ్ కి ఇచ్చి వివాహం చేశారు. ఇలా కొంతకాలం పాటు వైవాహిక జీవితంలో శ్రీజ దంపతులు సంతోషంగా ఉన్నారు.

ఇక వీరికి పాప పుట్టిన తర్వాత ఇద్దరి మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగానే వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు. అయితే విడాకులు తీసుకున్న తర్వాత శ్రీజ కూతురు అప్పుడప్పుడు తన తండ్రి వద్దకు వెళుతూ ఉండేది ఈ క్రమంలోనే దీపావళి పండుగను కూడా తన తండ్రి వద్దే జరుపుకున్నారు. ఇలా దీపావళి వేడుకలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసిన (Kalyaan Dhev) కళ్యాణ్ దేవ్ తాజాగా ఈ పోస్ట్ చేయడంతో అందరూ షాక్ అవుతున్నారు.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus