‘శ్రీకారం’ 2డేస్ కలెక్షన్స్?

  • March 13, 2021 / 12:45 PM IST

శ‌ర్వానంద్ ,ప్రియాంకా అరుళ్ మోహ‌న్ జంటగా నటించిన తాజా చిత్రం ‘శ్రీకారం’. కిశోర్.బి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 11న శివరాత్రి కానుకగా విడుదలయ్యింది. మొదటి షో నుండీ ఈ చిత్రానికి డివైడ్ టాక్ మొదలైంది. అయినప్పటికీ ఓపెనింగ్స్ బాగానే నమోదయ్యాయని చెప్పాలి. ’14 రీల్స్ ప్ల‌స్‌’ బ్యాన‌ర్ ‌పై రామ్ ఆచంట‌, గోపిచంద్ ఆచంట కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఇక ఈ చిత్రం రెండు రోజుల కలెక్షన్ల వివరాలను ఓ సారి పరిశీలిస్తే :

నైజాం   1.69 cr
సీడెడ్   1.00 cr
ఉత్తరాంధ్ర   0.76 cr
ఈస్ట్   0.54 cr
వెస్ట్   0.34 cr
గుంటూరు   0.73 cr
కృష్ణా   0.29 cr
నెల్లూరు   0.20 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)   5.55 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా   0.18 cr
ఓవర్సీస్   0.25 cr
వరల్డ్ వైడ్ (టోటల్)   5.98 cr

‘శ్రీకారం’ చిత్రానికి 17.1 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది కాబట్టి.. బ్రేక్ ఈవెన్ కు 17.5కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.మొదటిరోజు ఈ చిత్రం 5.98కోట్ల షేర్ ను రాబట్టింది. అంటే బ్రేక్ ఈవెన్ కు ఇంకా 11.52 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది . పోటీగా మరో 3 సినిమాలు ఉన్నప్పటికీ ఈ చిత్రం బాగానే రాణించింది. వీకెండ్ పూర్తయ్యేవరకూ ఇదే జోరు కొనసాగిస్తే బ్రేక్ ఈవెన్ ను సాధించే అవకాశం ఉంటుంది.

Click Here To Read Movie Review

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus