Sreeleela: శ్రీలీల ఫేవరెట్‌ హీరో ఎవరో తెలుసా? అవకాశం భలే వచ్చిందే!

ఏ హీరోతో నటిస్తుంటే ఆ హీరోను ఫేవరెట్‌ అని హీరోయిన్లు చెప్పడం మనం గతంలో చాలాసార్లు చూశాం. ఇప్పుడు మరో హీరోయిన్‌ కూడా అదే మాట చెబుతోంది. అయితే ఆ హీరోయిన్‌ ఆ సినిమాలో హీరో పక్కన హీరోయిన్‌గా నటించడం లేదు. చిన్నపాటి కన్‌ఫ్యూజన్‌ ఉన్నా.. విషయం అయితే క్లియర్‌. ఆ హీరోయిన్‌ శ్రీలీల అయితే, ఆ హీరో బాలకృష్ణ. అవును వాళ్లిద్దరి గురించే. ఈ ఇద్దరూ కలసి ప్రస్తుతం అనిల్‌ రావిపూడి సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా శ్రీలీల కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. తాను హీరో నందమూరి బాలకృష్ణకు వీరాభిమానిని శ్రీలీల చెప్పుకొచ్చింది. ‘‘నేను మొదటి నుండీ బాలకృష్ణకు వీరాభిమానిని. ఇప్పుడు ఆయనతోనే సినిమా చేస్తున్నాను. ఆయన వ్యక్తిత్వం చూశాక ఇప్పుడు ఇంకా అభిమానిని అయ్యాను. ఆయన నుండి ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాను’’ అని చెప్పింది శ్రీలీల. అంతేకాదు బాలకృష్ణతో నటించే సన్నివేశాల్లో జాగ్రత్తగా ఉంటున్నాను అని, డైలాగ్స్ విషయంలో తప్పులు దొర్లకుండా చూసుకుంటున్నానని కూడా చెప్పింది.

అంతేకాదు సినిమాలో తన పాత్ర గురించి తెలిస్తే అందరూ ఆశ్చర్యపోతారు అని చెబుతోంది. ఈ సినిమాలో బాలకృష్ణ కూతురిగా శ్రీలీల నటిస్తోందనే విషయం ఇప్పటికే బయటకు వచ్చింది. అయితే ఆ పాత్రలోనూ ట్విస్ట్‌ ఉంది అని ఇప్పుడు ఆమె మాటలు బట్టి అర్థమవుతోంది. యుక్తవయసులో అనుకోని పరిస్థితుల్లో జైలుకెళ్లిన తండ్రి… తిరిగి వచ్చాక ఏం చేశాడు, ఏం జరిగింది అనేది కథ అని చెబుతున్నారు. ఇప్పటివరకు బాలయ్యను ఎవరూ చూపించని విధంగా చూపిస్తాం అని అనిల్‌ రావిపూడి అంటున్నరు.

అలాగే తన కెరీర్‌ గురించి చెబుతూ.. ‘‘ప్రస్తుతం నేను చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాను. ఏ సినిమా సెట్‌లో ఉన్నాను అనే విషయంలోనే నేనే కన్ఫ్యూజ్ అయ్యేంతగా బిజీగా ఉండటం సంతోషంగా ఉంది’’ అంటూ తన ఆనందం వ్యక్తం చేసింది. ప్రస్తుతం శ్రీలీల బాలకృష్ణ సినిమాతోపాటు మహేశ్ బాబు, రామ్, నవీన్ పోలిశెట్టి, వైష్ణవ్ తేజ్ సినిమాలతో బిజీగా ఉంది.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus