Sreeleela: శ్రీ లీలా వేసుకున్న డ్రెస్ కాస్ట్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు ?

2023 సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ వేడుకలు ఇటీవల దుబాయ్ లో ఘనంగా జరిగాయి. దుబాయ్ లో గ్రాండ్ గా జరిగిన ఈ ఈవెంట్లో అనేకమంది సినీ ప్రముఖులు హాజరయ్యారు. దక్షిణాది సినీ పరిశ్రమకు చెందిన నటీనటులు, సాంకేతిక నిపుణుల ప్రతిభ‌ను గుర్తించేందుకు ఈ ప్రెస్టేజియస్ అవార్డును అందజేస్తారు. గత ప‌ది సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ అవార్డుల వేడుక ఈ ఏడాదితో 11వ వసంతంలోకి అడుగుపెట్టాయి. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ హీరో రానా, మంచు లక్ష్మిలు హోస్టులుగా వ్యవహరించారు.

ఇక సెప్టెంబర్ 15న తెలుగు, కన్నడ సినిమాలకు సంబంధించిన అవార్డుల ప్రదానం జరిగింది. ముఖ్యంగా నటీనటులు ఇచ్చే అవార్డులలో సైమా అవార్డు చాలా ప్రత్యేకం. తెలుగు సినిమాకు గాను ఉత్తమ నటుడి అవార్డు ఎన్టీఆర్ను వరించింది. అయితే శుక్రవారం సైమా అవార్డుల ఫంక్షన్ కు ఎంతోమంది సినీ తారలు తమదైన ఖరీదైన డ్రసుల్లో తళుక్కున మెరిశారు. వారిలో ఉత్తమ నటిగా ఎంపికైన శ్రీ లీల ఓ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.

పింక్, బ్లాక్ కాంబినేషన్లో ట్రెండీ వేర్ లో దేవకన్యల మెరిసిపోయింది. చూడడానికి చాలా సింపుల్ గా ఉన్న ఆ డ్రస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చాలా సింపుల్ గా ఉన్న ఈ డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసుకోవాలని నెటిజన్లు గూగుల్ తల్లిని ఆశ్రయిస్తున్నారు. ఇక ఆ అవార్డ్ ఫంక్షన్ లో శ్రీల వేసుకున్న డ్రెస్ కాస్ట్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

ఆమె వేసుకున్న ఈ పింక్ కలర్ సింపుల్ డ్రెస్ ఖరీదు రూ.36 వేలట . అయితే చూడడానికి అంత సింపుల్ గా ఉంది దాని డ్రస్‌ అంతా అని షాక్ అవుతున్నారు. ప్రస్తుతం శ్రీలీలకు (Sreeleela) అవకాశాలు వెల్లువలా వస్తున్నాయి. ప్రస్తుతం తన చేతిలో 12 సినిమాలు ఉన్నాయి.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus