Sreeleela: యాక్షన్‌ శ్రీలీల.. కొత్త లుక్‌లో అదిరిపోయిందిగా.. కానీ ఏంటా ప్రాజెక్ట్‌?

శ్రీలీల.. ఇప్పటివరకు చేసిన సినిమాల్లో గ్లామర్‌ డాల్‌గానే కనిపిస్తూ వచ్చింది. హీరో ఎవరైనా, ఆమె మాత్రం క్యూట్‌ అండ్ బ్యూటిఫుల్‌ లుక్‌లోనే కనిపించింది. ఆమె వయసు, ఫిజిక్‌, ఫిగర్‌కి ఆ పాత్రలు బాగా నప్పాయి కూడా. అయితే శ్రీలీలలో ఓ మాస్‌, యాక్షన్‌ వైబ్స్‌ కూడా ఉన్నాయి అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు దానినే బయటకు బాలీవుడ్‌ తీసుకొస్తోందని సమాచారం. ఈ మేరకు శ్రీలీల యాక్షన్‌ మోడ్‌లో ఉన్న ఓ ఫొటో బయటకు వచ్చింది. అయితే ఆ పిక్‌ దేనికి సంబంధించింది అనేది మాత్రం తెలియడం లేదు.

Sreeleela

కన్నడ సినిమాతో కెరీర్‌ ప్రారంభించి.. తెలుగులో స్టార్‌ హీరోయిన్‌ అయ్యి.. ఇప్పుడు తమిళ సినిమా, బాలీవుడ్‌లో తన హవా చాటే ప్రయత్నంలో ఉంది శ్రీలీల. అలా భాషలతో సంబంధంలేకుండా అగ్రతారలు, కుర్ర హీరోల సరసన అవకాశాలను అందిపుచ్చుకుంటోంది శ్రీలీల. ఇటీవల ‘రెడీ, స్టెడీ, ఫైర్‌… మిర్చీ రాబోతుంది! అక్టోబరు 19…’ అంటూ ఓ పోస్ట్‌ షేర్‌ చేసింది. అందులో శ్రీలీల యాజ్‌ ఏజెంట్‌ మిర్చీ అని కూడా రాశారు. దీంతో శ్రీలీల ఇంకా పేరు ఖరారు కానీ ఓ హిందీ ప్రాజెక్ట్‌లో భాగమవుతున్నట్లు అర్థమవుతోంది.

అయితే ఇదే క్యాప్షన్‌తో జోడిస్తూ బాలీవుడ్‌ నటుడు బాబీ డియోల్‌ కూడా ఓ సోషల్‌ మీడియా పోస్ట్ చేశారు. ‘పాప్‌కార్న్‌ తీసుకోండి షో ప్రారంభంకానుంది’’ అని రాసుకొచ్చారు. అలాగే ప్రొఫెసర్‌ వైట్‌ నాయిస్‌ పాత్రలో నటిస్తున్నట్లు ఓ పోస్టర్‌ షేర్‌ చేశాడు. దీంతో ఈ కాంబినేషన్‌ సినిమాలో కష్టం కాబట్టి.. ఇది సినిమానా? వెబ్‌ సిరీస్‌ కోసమా? యాడ్‌ కోసమా అనే డౌట్స్‌ మొదలయ్యాయి. ఎందుకంటే బాలీవుడ్‌లో యాడ్స్‌ కూడా ఇలా టీజ్‌ చేసి రిలీజ్‌ చేస్తుంటారు. ఇప్పటికైతే బాలీవుడ్‌లో శ్రీలీల రెండు సినిమాలు ఓకే చేసింది. కార్తిక్‌ ఆర్యన్‌ హీరోగా ఒకటి కాగా.. మరో యంగ్‌ హీరో సినిమాలో కూడా నటిస్తోందని సమాచారం.

వర్కింగ్‌ అవర్స్‌.. దీపికకు కౌంటర్‌ ఇచ్చిన సీనియర్‌ నటి.. లాజిక్‌ ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus