Sreeleela, Varun Tej: వరుణ్ కు జోడీగా పెళ్లిసందడి హీరోయిన్!

బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లతో వరుణ్ తేజ్ కు సినిమాసినిమాకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుతం వరుణ్ తేజ్ గని, ఎఫ్3 సినిమాలలో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలపై చెప్పుకోదగ్గ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. అయితే వరుణ్ కొత్త సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల ఎంపికైనట్టు తెలుస్తోంది. టాలెంట్ పుష్కలంగా ఉన్న శ్రీలీల ‘పెళ్లిసంద-డి’ సినిమాలో హీరోయిన్ గా నటించి మెప్పించారు. టాలీవుడ్ ఇండస్ట్రీని హీరోయిన్ల కొరత వేధిస్తున్న నేపథ్యంలో కృతిశెట్టి స్థాయిలో శ్రీ లీలకు కూడా ఆఫర్లు వచ్చే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తోంది.

వరుణ్ కు జోడీగా నటిస్తే మరి కొందరు యంగ్ హీరోలకు జోడీగా నటించే ఛాన్స్ శ్రీ లీలకు దక్కే అవకాశం ఉంది. వరుణ్ తేజ్ మూవీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుండగా ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా శ్రీలీల నటించనుండగా మరో హీరోయిన్ కు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. వరుణ్ ప్రస్తుతం నటిస్తున్న గని స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కగా ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.

మరోవైపు వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లో వరుణ్ నటించిన ఎఫ్3 మూవీ రిలీజ్ కానుంది. వరుణ్ తేజ్ సినిమాల ఎంపిక విషయంలో జాగ్రత్తలు వహిస్తూ ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటున్నారు. మరోవైపు రవితేజ నక్కిన త్రినాథరావు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో కూడా శ్రీ లీల నటించనున్నారని తెలుస్తోంది.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus