Sreeleela: రెమ్యునరేషన్ వల్ల ఆ హీరోతో సినిమా మిస్ చేసుకున్న శ్రీలీలా!

ఒక్క సినిమాతో క్రేజ్ తెచ్చుకున్న శ్రీలీల ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తుంది..ప్రస్తుతం ఒకేసారి ఏడు, ఎనిమిది సినిమాల్లో నటిస్తుంది.. ఈ అమ్మడు ఎంట్రీ తో స్టార్ హీరోయిన్లను పట్టించుకొనే వారు లేకుండా పోయారు..ఈ కన్నడ భామ 2019లో కిస్ చిత్రంతో సొంత పరిశ్రమలో ప్రస్థానం మొదలు పెట్టింది. పెళ్లి సందడితో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. పెళ్లిసందడి యావరేజ్ టాక్ తో బయటపడింది. శ్రీలీల మాత్రం కుర్రాళ్ల మదిలో రిజిస్టర్ అయ్యింది. వెంటనే రవితేజ ఆఫర్ ఇచ్చాడు.

ధమాకా చిత్రంలో హీరోయిన్ గా చేసింది.. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడంతో ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతుంది.. ఒక్క హిట్ సినిమాకే అమ్మడుకు క్రేజ్ పెరిగిపోయింది.. ప్రస్తుతం స్టార్ హీరోల నుంచి సీనియర్ హీరోల వరకు అందరు తమ శ్రీలీలలే ఉండాలని అడుగుతున్నారు.. దీంతో ఆ క్రేజ్ ను క్యాష్ చేసుకొనే పనిలో ఉంది.. దాంతో ఒక్కసారిగా రెమ్యూనరేషన్ ను కూడా భారీగానే పెంచేసిందని వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి..

ఇప్పుడు ఏకంగా 7 తెలుగు సినిమాలు చేస్తుంది. మహేష్ తో గుంటూరు కారం చేస్తున్న (Sreeleela) శ్రీలీల, బాలయ్య భగవాన్ కేసరి మూవీలో కీలక రోల్ చేస్తుంది. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో మెయిన్ హీరోయిన్. ఆదికేశవ, స్కంద, నితిన్ 32, విజయ్ దేవరకొండ 12వ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. అలా డిమాండ్ ఉన్నప్పుడు రెమ్యునరేషన్ విషయంలో ఎందుకు తగ్గుతారు. మొన్నటి వరకు యాభై లక్షలు లోపే తీసుకున్న శ్రీలీల కోటిన్నర అడుగుతుందని ఇండస్ట్రీ టాక్..

సాయి ధరమ్ తేజ్ హీరోగా దర్శకుడు సంపత్ నంది ఒక మూవీ చేయనున్నారని సమాచారం. సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా ఈ ప్రాజెక్ట్ తెరకెక్కనుందట. మొదట శ్రీలీలను హీరోయిన్ గా అనుకున్నారట. ఆమె భారీగా డిమాండ్ చేస్తున్న క్రమంలో ఆమె స్థానంలో పూజా హెగ్డేను తీసుకున్నారట. శ్రీలీలకు రెండు కోట్లు ఇచ్చే కంటే పూజా హెగ్డేను పెట్టుకుంటే పైసలు సేవ్ అవుతాయాని మేకర్స్ భావిస్తున్నారు.. ఇక ఇలా అమ్మడు పెంచుకుంటూ పోతే ఒక్కో అవకాశం జారిపోతాయని అభిమానులు అంటున్నారు.. చూద్దాం ఇంకా పెంచుతుందా? లేదా దిగుతుందా చూడాలి.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus