Bigg Boss 5: శ్రీరామ్ చంద్ర కి ప్రభాస్ పెద్దమ్మ సపోర్ట్

బిగ్‌బాస్ 5 తెలుగు తుది అంకానికి చేరుకుంది. ఈ ఆదివారంతో ఐదవ సీజన్‌కి ఎండ్ కార్డ్ పడనుంది. టైటిల్ విజేతలుగా ప్రచారం జరిగిన వారంతూ హౌస్‌ను వీడగా.. ప్రస్తుతం సన్నీ, శ్రీరామ్, సిరి, షణ్ముఖ్, మానస్‌లు ఇంటిలో వున్నారు. వీరిలో ఎవరు విన్నర్ కాబోతున్నారా అని ఉత్కంఠ నెలకొంది. సోషల్ మీడియాతో పాటు ఏ ఇద్దరు కలిసినా ఇప్పుడు బిగ్‌బాస్ గురించే మాట్లాడుకుంటున్నారట. అలాగే విన్నర్‌ గురించి భారీగా బెట్టింగ్ జరుగుతున్నట్లుగా కూడా తెలుస్తోంది.

అయితే కంటెస్టెంట్స్ ఐదుగురు తమకు ఓటు వేయాల్సిందిగా ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు సన్నీ- శ్రీరామ్ మధ్య టైటిల్ కోసం హోరాహోరీ పోరు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇద్దరికీ వేరువేరుగా ఫ్యాన్స్ వుండటంతో సోషల్ మీడియాలో క్యాంపెయినింగ్ జరుగుతోంది. అయితే సింగర్ శ్రీరామ్‌కు మద్ధతు ఎక్కువగా లభిస్తోంది. ఇండియన్ ఐడల్‌‌గా దేశవ్యాప్తంగా పాపులారిటీ వుండటంతో పాటు బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు సెలబ్రెటీలతో సన్నిహిత సంబంధాలు వుండటంతో శ్రీరామ్ చంద్ర తరపున వారే నేరుగా రంగంలోకి దిగారు.

ఇప్పటికే సోనూసూద్, శంకర్ మహాదేవన్, ఎండీ సజ్జనార్, పాయల్ రాజ్‌పుత్ సహా పలువురు సెలబ్రెటీలు శ్రీరామ్‌కు ఓటువేసి గెలిపించాల్సిందిగా తమ అభిమానులకు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు శ్రీరామచంద్రకి పెద్ద సపోర్ట్ లభించింది. అది కూడా ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యామిలీ నుంచి. కృష్ణంరాజు భార్య, ప్రభాస్‌కు పెద్దమ్మ అయిన శ్యామలా దేవి తన మద్ధతును ఆయనకు ప్రకటించారు.

ఈ మేరకు వీడియో సందేశం ద్వారా శ్రీరామ్‌కు ఓట్లు వేసి గెలిపించాలని అభిమానులను కోరారు. ఇండియన్ ఐడల్ గెలిచి తెలుగు వారికి గర్వకారణంగా నిలిచిన నువ్వు.. బిగ్‌బాస్ టైటిల్ కూడా గెలవాలని శ్యామలా దేవి శ్రీరామ్‌ను ఆశీర్వదించారు.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus