“పుట్టేప్పుడు ఏమీ తీసుకురాలేదు.. పోయేప్పుడు ఏమీ తీసుకెళ్లమ్” అనే విషయం అందరికీ తెలిసిందే అయినా ఏదో తెలియని దాహార్తితో ‘ఏదో సాధించేయాలి” అని ఆరాటపడిపోతుంటారు. అలాగే.. మన హీరోయిన్లు కూడా ఉన్న కొన్నాళ్ళ కెరీర్ లో కుదిరినన్ని సినిమాలు చేసేసి వీలైనంత డబ్బు సంపాదించేయాలని, అదే విధంగా ఏజ్ అయిపోతున్నా తమ అందం వెన్న తగ్గకూడదని నానా ఇబ్బందులూ పడుతూ డైటింగులని, ఎక్సర్ సైజులని తెగ తంటాలు పడుతుంటారు. 35, 40 దాటేవరకూ ఈ డైట్లు, వ్యాయామాల వలన ఉపయోగం ఉంటుంది కానీ.. 40 దాటాక బాడీ ఫిట్ గా ఉన్నా ముఖం మీద ముడతలు రావడం, లేదా ముఖంలో గ్లో తగ్గడం అనేది సర్వసాధారణంగా జరుగుతుంటుంది.
50 ఏళ్ళు దాటాక కూడా తమ శరీరంలో వయసు తెలియకూడదని సెలబ్రిటీలు చేస్తున్న హడావడి వారి ప్రాణాలను బలిగొంటుంది. అప్పట్లో మైఖేల్ జాక్సన్ కూడా అందం కోసం వెంపర్లాడి తన ప్రాణాలను తీసుకొన్నాడు. అదే తరహాలో ఇప్పుడు శ్రీదేవి కూడా సన్నగా ఉండడం కోసం డైట్ చేస్తూ.. డాక్టర్లు వద్దని వారించిన మందు తాగి బాత్ రూమ్ లోకి వెళ్ళి.. అక్కడ మత్తు కారణంగా తూలి బాత్ టబ్ లో పడి.. నీళ్ళలో ఊపిరి ఆడక మరణించింది శ్రీదేవి. ఇప్పుడే వచ్చిన దుబాయ్ ఫారెన్సీక్ రిపోర్ట్ ఆ విషయాన్ని ధృవీకరించాయి. ఇప్పటికైనా.. ఈ ప్లాస్టిక్ అందాల కోసం వెంపర్లాడకుండా, సహజమైన అందాలతో సహజంగా మన హీరోయిన్ జీవించాలని కోరుకొందాం.