లేడీ సూపర్ స్టార్ హోదాని అందుకున్న బ్యూటీ శ్రేదేవి. ఆమె తెలుగు, తమిళం, హిందీ భాషల్లోకలిపి దాదాపు 270 చిత్రాల్లో నటించింది. సినిమాలో ఆమె ఉందంటే చాలు.. ముందుగానే డిస్టిబ్యూటర్లు అడ్వాన్సులు ఇచ్చేవారు. అందుకే దర్శకనిర్మాతలు శ్రీదేవి డేట్స్ కోసం ప్రయత్నించేవారు. మరి ఆమె డేట్ ఇచ్చి, షూటింగ్ పూర్తిచేసిన చిత్రాలు థియేటర్లోకి రాలేదంటే నమ్ముతారా? ఇది నిజం. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సినిమాలు రిలీజ్ కాలేదట. 1988లో డైరెక్టర్ రమేష్ సిప్పీ… వినోద్ ఖన్నా, శ్రీదేవి, మాధురీ దీక్షిత్‌లతో “జమీన్” సినిమా తీస్తున్నట్టు ప్రకటించారు. సినిమాలో కొంత భాగం కూడా చిత్రీకరించారు. తరువాత ఆగిపోయింది. ఇది పూర్తయితే శ్రీదేవి, మాధురీ దీక్షిత్‌లు కలసిన నటించిన తొలి సినిమా అయ్యేది..
అదే డైరెక్టర్ 1991లో శ్రీదేవి, వినోద్ ఖన్నా, రుషి కపూర్‌లతో ‘గర్జన’ పేరుతో సినిమా తీస్తున్నట్టు ప్రకటించారు. ట్రైలర్ రిలీజ్ అయినా, సినిమా షూటింగ్ జరగలేదు.. స్టార్‌కాస్ట్ విషయంలో వివాదం చోటుచేసుకోవడంతో ఈ సినిమా ఆగిపోయిందని సమాచారం. డైరెక్టర్ అనిల్ శర్మ 1990లో అనిల్ కపూర్, శ్రీదేవిలో ‘మహారాజ్’ సినిమా తీస్తున్నట్లు ప్రకటించారు. కారణం తెలియదు కానీ ఈ సినిమా నిర్మాణం ఆగిపోయింది. 1996లో అనిల్‌కపూర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘తాను, శ్రీదేవి కలిసి ‘గోవిందా’ అనే సినిమాలో నటిస్తున్నట్టు చెప్పారు. ఈ సినిమాకు సంబంధించి ఫొటోషూట్ అయినప్పటికీ, సినిమా చిత్రీకరణ జరగలేదు. అప్పట్లో ఆగిపోయిన తన సినిమాల గురించి శ్రీదేవి బాధపడేది కాదని… ఎందుకంటే వాటి గురించి ఆలోచించే తీరిక ఆమెకి ఉండేది కాదని బాలీవుడ్ మీడియా ఓ కథనంలో తెలిపింది.