ఇలాంటి పుట్టినరోజు ఎవ్వరికీ రాకూడదు

అసలే తల్లి చనిపోయిందన్న బాధ, తన తల్లి సహజ మరణాన్ని అసహజ మరణం అంటూ మీడియా చేసిన హల్ చల్ చూసి కృంగిపోయిన చిన్నారి జాన్వీకపూర్ పుట్టినరోజు నేడు (మార్చి 6). పాపం చిట్టి తల్లి ఈ ఏడాది తన తల్లితో కలిసి పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకోవాలని, తన పుట్టినరోజు సందర్భంగా తన పరిచయ చిత్రమైన “ధడక్” టీజర్ లేదా మోషన్ పోస్టర్ ను విడుదల చేయించుకొని తల్లి ప్రశంసలు అందుకొని మురిసిపోవాలనుకొంది. కానీ. ఒక్క రాత్రి ఆమె ఆశలన్నిట్నీ నాశనం చేసింది. అప్పటివరకూ మోస్ట్ లక్కీయస్ట్ చైల్డ్ గా అందరి చేత ప్రశంసించబడిన జాన్వీ కపూర్ (Janhvi) ఒక్కసారిగా సాడ్ చైల్డ్ అయిపోయింది.

అందుకే. ఈ ఏడాది పూట్టినరోజు వేడుకలు నిర్వహించుకోవడం లేదు. అలాగే ప్లాన్ చేసుకొన్నట్లుగా తన పరిచయ చిత్రమైన “ధడక్”కి సంబంధించిన ఎలాంటి అప్డేట్ బయటకి రాకూడదని తేల్చి చెప్పేసింది. తల్లి చనిపోయిన 11వ రోజు అనగా పెద్ద దినం రోజున తన పుట్టినరోజు రావడం అనేది ఆమెకు చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే తన పుట్టుకకు, ఎదుగుదలకు కారణమైన మాతృమూర్తి తన చెంత లేదు. ఇంత దయనీయమైన పరిస్థితి మరెవ్వరికీ రాకూడదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus