Srihan: బాత్రూమ్ ఆపుకోలేని శ్రీహాన్ స్మిమ్మింగ్ పూల్ లో ఏం చేశాడు..? టాస్క్ లో జరిగింది ఇదే..!

బిగ్ బాస్ హౌస్ అంటేనే కాంట్రవర్సీలు, కొట్లాటలు. అయితే, టాస్క్ లు ఆడేటపుడు మాత్రం ఎదుటివాళ్లు పెట్టే రూల్స్ కి హౌస్ మేట్స్ చెక్ పెడుతూ ఉంటారు. దీనివల్లే గొడవలు జరుగుతాయి. బిబి హోటల్ టాస్క్ లో సరిగ్గా ఇదే జరిగింది. హోటల్ మేనేజర్ గా ఉన్న సుదీప వాష్ రూమ్ వాడుకోవాలంటే 500 చెల్లించాలి అంటూ రూల్ పెట్టింది. దీంతో గెస్ట్ లుగా వచ్చిన వాళ్లు వాష్ రూమ్ ఆపుకోవాల్సి వచ్చింది. మరోవైపు ఆపోజిట్ హోటల్ వాళ్లు కొంతమంది గెస్ట్ లతో డీల్స్ కుదుర్చుకున్నారు.

దీంతో మేనేజర్ సుదీప, స్లామ్ మేనేజర్ ఫైమాకి వార్నింగ్ ఇచ్చింది. ఎవరు వాష్ రూమ్ వాడుకున్న డబ్బులు చెల్లించాల్సిందే అంటూ వాళ్ల స్టాఫ్ ని కాపలా పెట్టింది. ఇక్కడ రాత్రి అంతా హైడ్రామా జరిగింది. ఆదిరెడ్డి 200 ఇస్తాను వాష్ రూమ్ వాడుకుంటా అన్నా కూడా హోటల్ స్టాఫ్ కనికరించలేదు. దీంతో ఆదిరెడ్డితో పాటుగా శ్రీహాన్ కూడా స్మిమ్మింగ్ పూల్ లో దిగి వాష్ రూమ్ వెళ్దామని స్కెచ్ గీసుకున్నారు. ఇది తెలిసిన హోటల్ స్టాఫ్ అందరూ కూడా స్మిమ్మింగ్ పూల్ కూడా హోటల్ లో భాగమే అని వాదించారు.

ఆదిరెడ్డి హోటల్ అంటే అక్కడి వరకే అని, పూల్ మాత్రం ఏ హోటల్ కి సంబంధించినది కాదు అని ఆర్గ్యూ చేశాడు. కాసేపటి తర్వాత శ్రీహాన్ రేవంత్ తో మాట్లాడుతూనే పూల్ లోకి దిగాడు. పూల్ లో చాలాసేపు ఉన్నాడు. రేవంత్ ఏంటి ఊపిరి గట్టిగా పీలుస్తున్నావ్ ? వాష్ రూమ్ కి వెళ్లిపోయావా అంటూ ప్రశ్నించాడు. శ్రీహాన్ చేసిన పనికి అందరూ ఒక్కసారి షాక్ అయ్యారు. అయితే, నిజంగా శ్రీహాన్ పూల్ లోకి దిగి బాత్రూమ్ వెళ్లాడా లేదా అనేది మాత్రం కనిపించలేదు. పూల్ లో చాలాసేపు ఉన్న శ్రీహాన్ బయటకి వచ్చాడు.

నిజానికి హోటల్ లో గెస్ట్ గా హీరో హోదాలో వచ్చాడు శ్రీహాన్. కానీ, డబ్బులు ఎవరి దగ్గర ఎక్కువ ఉంటాయో వాళ్లు మాత్రమే కెప్టెన్సీ పోటీదారులు అవుతారు అనే సరికి అందరూ డబ్బులు దాచుకోవడం మొదలుపెట్టారు. దీంతో బిగ్ బాస్ రెండు హోటల్స్ ని ఒక్క హోటల్ గా మార్చాడు. ఆ తర్వాత గెస్ట్ లు వాళ్లకి నచ్చిన వాళ్లకి టిప్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఫైనల్ గా ఈ టాస్క్ లో ఎవరు కెప్టెన్సీ పోటీదారులు అయ్యారు అనేది చూడాలి. అదీ మేటర్.

కృష్ణ వృంద విహారి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus