సినిమాకు సీక్వెల్స్ రావడం కొత్త విషయమేమీ కాదు.. అయితే సినిమా సెట్స్ మీద ఉండగానే సీక్వెల్‌ను ఓకే చేసుకోవడం పెద్ద విషయమే. అయితే ఇటీవల కాలంలో వాటిని రెండు పార్టులు అని అంటున్నారు లెండి. అంటే ముందుగానే కథ, కథనం, నిడివి మీద అంచనా వేసుకుని సినిమాను రెండు ముక్కలు చేసేస్తున్నారు. ఇలా ఇటీవల కాలంలో సినిమాలు వచ్చి మంచి విజయాలు కూడా అందుకున్నాయి. మరికొన్ని ఆ దారిలో ఉన్నాయి కూడా. అయితే అవన్నీ పెద్ద సినిమాలే. అయితే ఇప్పుడు ఓ చిన్న సినిమాను రెండు ముక్కలు చేసేశారని సమాచారం.
అవును, కొత్త కుర్రాడు హీరోగా పరిచయమవుతూ, పేరున్న దర్శకుడు చేస్తున్న ఓ సినిమాను రెండు భాగాలుగా విడగొట్టారని సమాచారం. ‘జయ జానకీ నాయక’, ‘అఖండ’ లాంటి సినిమాలను అందించిన మిరియాల రవీందర్ రెడ్ది ఇంటి నుండి త్వరలో ఓ హీరో రాబోతున్నాడు. ‘పెద కాపు’ అనే టైటిల్ ఈ సినిమాకు పరిశీలిస్తున్నారు. ఆ సినిమానే ఇప్పుడు రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారని టాక్ నడుస్తోంది. కోనసీమ రాజకీయాలు, అక్కడి వర్గ పోరాటాలు, కులాల ఆధిపత్యాల చుట్టూ తిరిగే కథ ఇది.
1980 బ్యాక్ డ్రాప్‌లో ఈ ‘పెదకాపు’ సినిమా సాగుతుందని సమాచారం. సినిమా కోసం తీసిన ఫుటేజ్, రషెష్ చూసుకున్న టీమ్ ఈ కథని రెండు భాగాలుగా విడగొడితే మంచిది అనుకుంటున్నారట. అందుకే ‘పెద కాపు 1’, ‘పెద కాపు 2’ అనే పేర్లతో సినిమా రిలీజ్ చేస్తారట. తొలి భాగానికి, రెండో భాగానికీ ఆరు నెలల గ్యాప్ ఉంటుందని చెబుతున్నారు. షూటింట్ దాదాపుగా పూర్తి కావొచ్చిందని సమాచారం. త్వరలోనే ఫస్ట్ లుక్ విడుదల చేసి… ప్రచారం షురూ చేస్తారట.
శ్రీకాంత్ అడ్డాల (Srikanth Addala) ఇటీవల ‘నారప్ప’ సినిమా చేశారు. ఆ సినిమా నేరుగా ఓటీటీలోకి వచ్చి మంచి విజయం అందుకుంది. ఆ తర్వాత చాలా సినిమాలు అనుకున్నా ఈ సినిమా ఓకే అయ్యిందని సమాచారం. ‘ముకుంద’తో హీరోల లాంచింగ్‌కు శ్రీకాంత్ అడ్డాల మంచి హ్యాండ్ అనే పేరు కూడా ఉంది.
విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?
శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?