నాగచైతన్య చిత్రంలో విలన్ గా నటిస్తున్న శ్రీకాంత్
- April 18, 2017 / 09:52 AM ISTByFilmy Focus
నెగిటివ్ క్యారెక్టర్స్ తో చిత్ర సీమలోకి అడుగుపెట్టిన శ్రీకాంత్ .. తర్వాత హీరోగా మారి సూపర్ హిట్స్ అందుకున్నారు. కుటుంబ కథా చిత్రాలు చేసి మహిళలలో అధిక ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈయన అప్పుడప్పుడు సైడ్ రోల్స్ చేస్తూ వచ్చారు. తాజాగా విలన్ గా నటించడానికి సిద్ధమయ్యారు. యువ సామ్రాట్ నాగ చైతన్య ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రారండోయ్ వేడుక చూద్దాం.. అనే సినిమా చేస్తున్నారు. ఇది షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఈ మూవీ తరవాత కృష్ణ మరిముత్తు దర్శకత్వంలో థ్రిల్లర్ సినిమా చేస్తున్నారు. రీసెంట్ గా సెట్స్ పైకి వెళ్లిన ఈ చిత్రంలో శ్రీకాంత్ విలన్ గా నటించడం ఖరారు అయింది.
దీని గురించి శ్రీకాంత్ మాట్లాడుతూ ” ప్రస్తుతం నేను రారా, నాటుకోడి అనే చిత్రాల్లో హీరోగా నటిస్తున్నా. నాగచైతన్య హీరోగా నటిస్తున్న చిత్రంలో విలన్‌గా నటిస్తున్నాను” అని వివరించారు. విలన్ గా ఒప్పుకోవడంపై మాట్లాడుతూ ” చలనచిత్ర రంగంలో కళాకారుడిగా గుర్తింపు రావాలంటే అన్ని క్యారెక్టర్లు చేస్తేనే గుర్తింపు వస్తుంది. అవకాశాలు వచ్చినప్పుడు హీరోలుగా నటించినంత మాత్రాన మిగతా క్యారెక్టర్లలో నటించకూడదని నిబంధనేమీ కళాకారుడు పెట్టుకోకూడదు” అని చెప్పారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















