జయాపజయాలతో సంభంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు బాలయ్య. గత ఏడాది ఆయన నటించిన ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు మరియు ఇటీవల విడుదలైన రూలర్ ఘోర పరాభవాన్ని చవిచూశాయి. దీనితో ఈసారి గట్టిగా కొట్టాలనే ఉదేశం తో తనకు కలిసొచ్చిన దర్శకుడు బోయపాటి శ్రీనుతో కమిట్ అయ్యాడు. మిర్యాల రవీంద్రా రెడ్డి నిర్మాతగా తెరకెక్కనున్న ఈ చిత్రం వచ్చే నెలలో సెట్స్ పైకి వెళ్లే అవకాశం కలదు. ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ మూవీ షూటింగ్ త్వరిత గతిన పూర్తి చేసి సమ్మర్ కానుకగా విడుదల చేయాలనే యోచనలో నిర్మాతలు ఉన్నారట.
ఈ మూవీలో హారో శ్రీకాంత్ విలన్ గా చేయడం విశేషం. ఐతే బాలయ్య హీరో శ్రీకాంత్ ని విలన్ గా పెట్టుకోవడం వెనుక లెజెండ్ సెంటిమెంట్ ని ఫాలో అవుతున్నాడా అనిపిస్తుంది. ఫార్మ్ కోల్పోయి సినిమాలు లేక ఇబ్బంది పడుతున్న ఫ్యామిలీ చిత్రాల హీరో జగపతి బాబును లెజెండ్ చిత్రంతో విలన్ గా బాలయ్య పరిచయం చేశారు. విలన్ గా జగపతి బాబు సూపర్ సక్సెస్ అవగా.. సినిమా బంపర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం శ్రీకాంత్ పరిస్థితి కూడా లెజెండ్ కి ముందు జగపతి బాబు పరిస్థితే…అని చెప్పాలి. ఈయనకు సోలో హీరోగా అవకాశాలు ఎప్పుడో కనుమరుగై పోగా, అడపాదపా చిత్రాలలో ప్రాధాన్యం ఉన్న రోల్స్ చేస్తున్నారు. టాలీవుడ్ లో జగపతి బాబు, శ్రీకాంత్ లది ఒకప్పుడు సేమ్ ఇమేజ్. ఫ్యామిలీ చిత్రాల హీరోలుగా ఇద్దరు పోటీపడేవారు. ఈ నేపథ్యంలో లో హీరో శ్రీకాంత్ ని విలన్ గా తీసుకొని హిస్టరీ రిపీట్ చేయాలని బాలయ్య చూస్తున్నాడా అని పిస్తుంది.
మరో ప్రక్క శ్రీకాంత్ బాలయ్య, బోయపాటి తీసిన లెజెండ్ మూవీ విలన్ గా జగపతి బాబు ని ఎలా ఫేమస్ చేసిందో… అలాగే తాను విలన్ గా స్థిరపడతాను అనే సెంటిమెంట్ ఫాలో అవుతున్నారా… అని సందేహం కలుగుతుంది.ఇక బోయపాటి పరిస్థితి కూడా ఏమంత మెరుగ్గా లేదు.గత ఏడాది రామ్ చరణ్ తో ఆయన చేసిన వినయ విధేయ రామ పరాజయం పాలైంది.దీనితో ఆయన బాలయ్య సెంటిమెంట్ ని నమ్ముకున్నారు. ఇలా ఈ ముగ్గురు ఏదో ఒక సెంటిమెంట్ చుట్టూ తిరుగుతున్నారు అనిపిస్తుంది. సెంటిమెంట్ ఎవరిదైనా వీరు అనుకున్న హిట్ అందితే అదే పదివేలు.
సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!