NTR30: ఆ రోల్ గురించి క్లారిటీ ఇచ్చిన శ్రీకాంత్.. ఏం చెప్పారంటే?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెకుతున్న సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో శ్రీకాంత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన శ్రీకాంత్ షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. శ్రీకాంత్ మాట్లాడుతూ మూడు వెబ్ సిరీస్ లలో నటించానని ఆయన అన్నారు. మంచు విష్ణుతో ఒకటి, సుస్మిత బ్యానర్ లో ఒకటి, అమెజాన్ ప్రైమ్ లో ఒకటి చేశానని ఆయన తెలిపారు.

అఖండ సినిమా నుంచి నేను టర్న్ అయ్యానని శ్రీకాంత్ తెలిపారు. అగ్రిమెంట్లకు ఓకే చెబితే ఏం చెప్పినా చేయాల్సిందేనని శ్రీకాంత్ చెప్పుకొచ్చారు. లేదంటే బూతులు మాట్లాడాల్సి ఉంటుందని ఆయన కామెంట్లు చేయడం గమనార్హం. జూనియర్ ఎన్టీఆర్ తో తొలిసారి కలిసి పని చేస్తున్నానని శ్రీకాంత్ అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ నన్ను బాబాయ్ అని పిలుస్తాడని ఎన్టీఆర్ తో మూవీ అంటే చాలా హ్యాపీగా ఉందని శ్రీకాంత్ తెలిపారు.

అటు రామ్ చరణ్ ఇటు తారక్ తో కలిసి పని చేస్తున్నానని రామ్ బోయపాటి కాంబో మూవీలో కూడా పని చేస్తున్నానని శ్రీకాంత్ అన్నారు. ఎన్టీఆర్ సినిమాలో మంచి పాత్ర అని తారక్ కాంబినేషన్ లో ఉంటానని ఆ పాత్ర నెగిటివ్ గా ఉంటుందని పాజిటివ్ గా ఉంటుందని శ్రీకాంత్ కామెంట్లు చేశారు. ఇంకా చాలామంది హీరోలతో పని చేయాలని ఉందని శ్రీకాంత్ అన్నారు.

పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్ లతో పని చేయాలని ఉందని ఆయన కామెంట్లు చేశారు. గోపీచంద్ ముందునుంచి పరిచయమే అని శ్రీకాంత్ చెప్పుకొచ్చారు. గోపీచంద్ కూడా ఎక్కువగా మాట్లాడడని శ్రీకాంత్ వెల్లడించారు. శ్రీకాంత్ చెప్పిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమా సినిమాకు శ్రీకాంత్ రేంజ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus