సినీ నటుడు శ్రీకాంత్ చేసిన సాహస యాత్ర ప్రస్తుతం ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ గా మారింది. ఒక స్టార్ హీరో అయి ఉండి ఆరు వేల కిలోమీటర్ల రోడ్ ట్రిప్ వేయడం అంటే అభినందించ తగ్గ విషయమని చెప్పుకుంటున్నారు. శ్రీకాంత్ గత నెలలో 17 వ తేదీన ముగ్గురి మిత్రులతో హైదరాబాద్ నుంచి ఈ యాత్రను ప్రారంభించారు. పది రోజుల పాటు సాగిన ఈ యాత్రలో శ్రీనగర్ దాల్ లేక్, కార్గిల్, లేహ్ లడక్, కరుడుంగల, మనాలి తదితర ప్రాంతాలు చుట్టారు.
ఈ ట్రిప్ విశేషాలను ఓ మీడియాతో పంచుకున్నారు. “ఫ్లయిట్, హెలికాఫ్టర్ సహాయంతో శ్రీనగర్ , లడక్ ప్రాంతాల్లో వెళ్లడం చాలా సులువే. కానీ బై రోడ్ వెళ్లడం చాలా కష్టం. జమ్మూ నుంచి శ్రీనగర్ వెళ్లే రూట్ దారుణంగా ఉంటుంది. అక్కడ డ్రైవింగ్ చేయడం కొత్త అనుభూతిని కలిగించింది. ఆ టైంలో వర్షం పడి ఉంటే మా పరిస్థితి వేరేగా ఉండేది. అప్పుడు మమ్మల్ని దేవుడు కాపాడాడు అనిపించింది” అని వెల్లడించారు. ఇంకా ట్రిప్ గురించి మాట్లాడుతూ ” మైనస్ డిగ్రీల చలిలో గడపడం, రోడ్ సైడ్ డాబాల్లో నిద్ర పోవడం ఎప్పటికీ గుర్తుండి పోతాయి.
అంతేకాకుండా రోడ్డు పైన వాహనం నడిపేటప్పుడు ఎంతో సహనం ఉండాలి. కోప్పడ్డామంటే దేవుడు మన మీద కోప్పడుతాడు. ఈ ట్రిప్ కి సామాన్యుడిలా వెళ్లి కోపాన్ని తగ్గించుకుని, ఎన్నో నేర్చుకుని యోగిలా వచ్చాను” అని శ్రీకాంత్ వివరించారు. వచ్చే ఏడాది బై రోడ్ విదేశాలకు టూర్ ప్లాన్ చేయనున్నట్లు చెప్పారు.
Hi guys finally finished my adventure road trip Hyderabad to Leh Ladakh to Hyderabad..amazing trip..unforgettable pic.twitter.com/5hMC5kHpku