2014 మహేష్ బాబుకి (Mahesh Babu) కలిసి రాలేదు. ఆ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ‘1 నేనొక్కడినే’ (1: Nenokkadine) , దసరాకి కొద్దిరోజుల ముందు రిలీజ్ అయిన ‘ఆగడు’ (Aagadu) వంటి సినిమాలు భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యి డిజాస్టర్స్ గా మిగిలిపోయాయి. దీంతో మహేష్ ఫ్యాన్స్ బాగా డిజప్పాయింట్ అయ్యారు. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని దర్శకుడు కొరటాల శివతో (Koratala Siva) ‘శ్రీమంతుడు’ (Srimanthudu) చేశాడు మహేష్. మొదట ఈ సినిమా పై ఎటువంటి అంచనాలు లేవు. కానీ టీజర్ రిలీజ్ అయ్యాక బజ్ ఏర్పడింది.
ఇక సాంగ్స్, ట్రైలర్ ఆకట్టుకోవడంతో అంచనాలు పెరిగాయి. ఇక 2015 ఆగస్టు 7న రిలీజ్ అయిన ఈ సినిమా యునానిమస్ గా పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. బాక్సాఫీస్ వద్ద నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచి చరిత్ర సృష్టించింది. ఒకసారి ‘శ్రీమంతుడు’ (Srimanthudu) క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :
‘శ్రీమంతుడు’ చిత్రం రూ.57 కోట్ల(షేర్) బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది.ఫుల్ రన్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 85.20 కోట్ల షేర్ ని రాబట్టి… అంటే 28 కోట్ల వరకు ప్రాఫిట్స్ ను అందించింది. నెట్ పరంగా చూసుకుంటే ‘బాహుబలి ది బిగినింగ్’ (Baahubali) తర్వాత రూ.100 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా ఇదే.