ఎన్టీఆర్ విషయం పై స్పందించిన శ్రీనివాస్ రెడ్డి!

కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా నిరూపించుకున్నారు. అయినా కమెడియన్ రోల్స్ వదులుకోలేదు. రీసెంట్ గా వచ్చిన రవితేజ మూవీ “రాజా ది గ్రేట్” లోను తనదైన టైమింగ్ తో నవ్వులు పూయించారు. ఈ సందర్భంగా అతను మీడియాకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ప్రచారంలో ఉన్నట్టు తనకి ఎన్టీఆర్ కి ఎటువంటి గొడవలు లేవని స్పష్టంచేశారు. ఎన్టీఆర్ గురించి మీరు ఇక్కడివి అక్కడ.. అక్కడివి ఇక్కడ చెప్పారని ఆయన మిమ్మల్ని దూరం చేశారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అవన్నీ నిజమేనా..? అనే విలేకరి అడిగిన ప్రశ్నకు శ్రీనివాస్ రెడ్డి ఇలా సమాధానమిచ్చారు.

“నాకు తెలిసిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్‎. నాకు తెలిసిన వాళ్లలో అందరూ ఎన్టీఆర్ కన్నా తక్కువ రేంజ్ వాళ్లే.. మరి అలాంటి వాళ్లతో నేను ఎన్టీఆర్ గురించి చెప్పడం వల్ల నాకు ఒరిగేదు లేదు, ఆయనకు జరిగే నష్టం అసలే లేదు” అని వివరించారు. ఇంకా మాట్లాడుతూ.. ” ఈ విషయం గురించి నేను ఎన్టీఆర్‎తో డైరెక్ట్‎గా కూడా మాట్లాడాను. నా గురించి ఏమైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గరకు వచ్చిందా..? అని అడిగా.. దానికి ఆయన అలాంటిదేమీ లేదు అని చెప్పారు. ఇండస్ట్రీలో నాపై వినిపిస్తున్న ఆ మాటలన్నీ ప్రచారాలే తప్ప అందులో వాస్తవాలు లేవు” అని శ్రీనివాస్ రెడ్డి వివరించారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus