Srinu Vaitla, Jr NTR: ఎన్టీఆర్ ను అలా చూసి ఏడ్చేశానన్న శ్రీను వైట్ల!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖులు తారక్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ 30, ఎన్టీఆర్ 31 సినిమాలకు సంబంధించిన అప్ డేట్లు రావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ను ఊరమాస్ రోల్ లో చూపించనున్నారని ఫ్యాన్స్ కు క్లారిటీ వచ్చేసింది. తారక్ పుట్టినరోజు సందర్భంగా శ్రీను వైట్ల సోషల్ మీడియాలో ఒక ట్వీట్ చేయగా ఆ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.

తారక్, శ్రీనువైట్ల కాంబినేషన్ లో బాద్ షా సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా హిట్ గా నిలిచింది. బండ్ల గణేష్ ఈ సినిమాకు నిర్మాత కాగా ఈ సినిమా ద్వారా ఆయనకు బాగానే లాభాలు వచ్చాయి. హ్యాపీ బర్త్ డే మై డియర్ బాద్ షా అంటూ శ్రీనువైట్ల తారక్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. నిన్ను చూడాలని తొలిరోజు షూట్ నుంచి ఇప్పటివరకు తారక్ ఎదుగుదలకు తాను ప్రత్యక్ష సాక్షినని శ్రీనువైట్ల పేర్కొన్నారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు పాన్ ఇండియా టైగర్ అని శ్రీనువైట్ల కామెంట్లు చేశారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నటన అత్యద్భుతమని ఆయన చెప్పుకొచ్చారు. కొమురం భీముడో సాంగ్ లో అద్భుతమైన నటన ద్వారా ఎన్టీఆర్ తనకు కన్నీళ్లు వచ్చేలా చేశారని శ్రీనువైట్ల పేర్కొన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఎంతో ఎత్తులకు ఎదగాలని మరెన్నో సక్సెస్ లను అందుకోవాలని కోరుకుంటున్నానని ఆయన చెప్పుకొచ్చారు.

మరో స్టార్ హీరో రామ్ చరణ్ సైతం సోదరుడు, సహచరుడు, స్నేహితుడు అయిన తారక్ తనకు ఏమవుతాడో చెప్పడానికి పదాలు కూడా సరిపోవడం లేదని వెల్లడించారు. మన మధ్య అనుబంధాన్ని లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకుంటానని హ్యాపీ బర్త్ డే అంటూ చరణ్ చెప్పుకొచ్చారు. సాయిధరమ్ తేజ్, రామ్ పోతినేని, అజయ్ దేవగణ్, నాగశౌర్య, హరీష్ శంకర్, మెహర్ రమేష్, ఈషా రెబ్బా, మరి కొందరు సెలబ్రిటీలు తారక్ కు బర్త్ డే విషెస్ తెలియజేశారు.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus