పొరుగు కథను నమ్ముకోనున్న శ్రీను వైట్ల
- June 24, 2017 / 06:07 AM ISTByFilmy Focus
దూకుడు సినిమాతో టాలీవుడ్ టాప్ డైరక్టర్ గా పేరు తెచ్చుకున్న శ్రీను వైట్ల వరుసగా అపజయాలను చవిచూశాడు. బాద్ షా, ఆగడు, బ్రూస్లీ.. ఇలా ఒకదానికి మించి మరొకటి డిజాస్టర్ గా మిగిలాయి. రీసెంట్ గా వరుణ్ తేజ్ తో చేసిన మిస్టర్ మూవీ కూడా గట్టెక్కించలేక పోయింది. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమలో ఏ స్టార్ హీరో శ్రీను వైట్లతో సినిమా చేయడానికి ఆసక్తి చూపించడం లేదు. కథ వినమన్నా తర్వాత వింటామని దాటవేస్తున్నారు. ఈ సమయంలో మాస్ మహారాజ్ రవితేజ శ్రీను వైట్లకు ఛాన్స్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఈ డైరక్టర్ రవితేజకి ‘వెంకీ’, ‘దుబాయ్ శీను’ వంటి సూపర్ హిట్స్ ఇచ్చారు.
ఆ అభిమానంతో శ్రీను వైట్ల దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ ఛాన్స్ తో మళ్లీ ఫామ్లోకి రావాలని భావిస్తున్నారు. అందుకే కొత్త కథతో కంటే .. ఇదివరకే హిట్ అయినా కథతో చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నారు. అందుకే ఇతర భాషల్లో రవితేజకి సూటయ్యే కథ అన్వేషణలో ఉన్నారు. ఈ ప్లాన్ అయినా శ్రీను వైట్లకు హిట్ ట్రాక్ లోకి తీసుకొస్తుందేమో చూడాలి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















