Sruthi Hassan: సినిమాల విషయంలో అలాంటివి ఆలోచించను!

లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ వారసురాలుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన నటి శృతిహాసన్ కెరియర్ మొదట్లో వరుస ఫేల్యూస్ ఎదుర్కొని ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు. అయితే తనలో ఉన్న నటనను నిరూపించుకొని ఈమె ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతూ వచ్చారు.. అయితే తన వ్యక్తిగత కారణాల వల్ల కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరమైన శృతిహాసన్ తిరిగి క్రాక్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన హిట్ అందుకున్నారు. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈమెకు సీనియర్ హీరోలైన చిరంజీవి బాలకృష్ణ వంటి సినిమాలలో నటించే అవకాశాలు వచ్చాయి.

ఇలా చిరంజీవి బాలయ్యతో నటించిన సినిమాలు ఈ ఏడాది సంక్రాంతి పండుగకు విడుదలై అద్భుతమైన విజయాన్ని అందుకున్నాయి. యంగ్ హీరోలతో నటించాల్సిన శృతిహాసన్ ఇలాగా సీనియర్ హీరోలతో నటించడం వల్ల పెద్ద ఎత్తున ఈమె గురించి విమర్శలు వచ్చాయి. కేవలం రెమ్యూనరేషన్ కోసమే ఇలా సీనియర్ హీరోల సరసన నటిస్తున్నారు అంటూ కామెంట్లు కూడా వినిపించాయి. అయితే తాజాగా ఈ వ్యాఖ్యలపై నటి సమంత సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాను (Sruthi Hassan) ఒక సినిమాకి సైన్ చేసేటప్పుడు సినిమాలో కథ ఏంటి నా పాత్రకు ప్రాధాన్యత ఎంత ఉంది అనేది మాత్రమే ఆలోచిస్తానని తెలిపారు. మిగిలిన విషయాల గురించి తాను పట్టించుకోనని అవి దర్శక నిర్మాతలు చూసుకుంటారని తెలిపారు. ఇక ఆ సినిమాలో హీరో ఎవరు? ఆయన వయస్సు ఎంత నాకి ఆయనకు మధ్య గ్యాప్ ఎంత అనే విషయాల గురించి తాను అసలు పట్టించుకోనని తెలిపారు.

లెజెండ్స్ పక్కన నటించే అవకాశాలు తరచూ రావని బాలకృష్ణ చిరంజీవి వంటి లెజెండరీ హీరోలతో నటించే అవకాశం వచ్చినందుకు తనకు చాలా హ్యాపీగా ఉంది అంటూ ఈ సందర్భంగా శృతిహాసన్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus