Sruthi Hassan: ఆల్కహాల్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన శృతి.. తాగుతానంటూ?

టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్లలో ఒకరైన శృతి హాసన్ సంక్రాంతికి విడుదలైన రెండు సినిమాలలో హీరోయిన్ గా నటించడంతో పాటు రెండు సినిమాలతో విజయాలను అందుకున్నారు. సలార్ సినిమా షూట్ ను పూర్తి చేసిన శృతి ఈ సినిమాతో మరో పాన్ ఇండియా హిట్ ను సొంతం చేసుకుంటానని భావిస్తున్నారు. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ముచ్చటించిన శృతి హాసన్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. మద్యం తాగుతారా అనే ప్రశ్నకూ శృతి హాసన్ స్పందిస్తూ గత ఆరేళ్లుగా నేను ఆల్కహాల్ ముట్టుకోలేదని ఆమె అన్నారు.

కొన్ని సందర్భాలలో మాత్రం ఆల్కహాల్ లేని బీర్ ను తాగుతానని శృతి హాసన్ కామెంట్లు చేశారు. కమల్ కూతురిగా సినిమాల్లోకి వచ్చిన శృతి హాసన్ తక్కువ సమయంలోనే పాపులారిటీని పెంచుకున్నారు. శృతి హాసన్ రెమ్యునరేషన్ సైతం అంతకంతకూ పెరుగుతోంది. శృతి హాసన్ రెమ్యునరేషన్ సైతం భారీ రేంజ్ లో ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. సీనియర్ హీరోలకు ఈ బ్యూటీ మంచి ఆప్షన్ గా నిలుస్తున్నారు.

శృతి హాసన్ త్వరలో కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని సమాచారం అందుతోంది. తమిళంలో కూడా శృతి హాసన్ ఎక్కువ ప్రాజెక్ట్ లలో నటించడం లేదని తెలుస్తోంది. శృతి హాసన్ కెరీర్ పరంగా కొన్ని పొరపాట్లు చేస్తున్నారు. శృతి హాసన్ అందం, అభినయంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. వ్యక్తిగత కారణాల వల్ల కొన్నేళ్లు కెరీర్ పరంగా గ్యాప్ తీసుకోవడం ఆమె కెరీర్ కు మైనస్ అవుతోందని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

శృతి హాసన్ తన గురించి వచ్చిన రూమర్ల గురించి సైతం వెంటనే రియాక్ట్ అవుతూ కెరీర్ ను కొనసాగిస్తున్నారు. శృతి చాలా విషయాలలో ఇతర హీరోయిన్లకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. శృతి హాసన్ తన రేంజ్ ను మార్చే ప్రాజెక్ట్ లలో ప్రాజెక్ట్ లలో నటించాలని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. శృతి హాసన్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus