దర్శకధీరుడు రాజమౌళి ఎంతో భారీస్థాయిలో తెరకెక్కించిన RRR సినిమా కరెక్ట్ గా విడుదల అయ్యే సమయం లోనే ఏదో ఒక ఆటంకం వచ్చి వాయిదా పడేలా చేస్తోంది. కరోనా కారణంగా ఇప్పటికే ఈ సినిమా మూడు సార్లు వాయిదా పడింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కారణంగా మరో రెండు సార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ఈ సంక్రాంతి ఎలాగైనా ప్రేక్షకుల ముందుకు సినిమాలు తీసుకురావాలని అనుకున్న రాజమౌళి ఊహించని విధంగా మళ్ళీ కరోనాతో సినిమాను పోస్ట్ పోన్ చేయక తప్పలేదు.
మళ్లీ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే విషయంలో కూడా ఇంతవరకు చిత్ర యూనిట్ సభ్యులు క్లారిటీ ఇవ్వలేదు. మార్చిలో విడుదల చేస్తే బాగుంటుంది అని ఇటీవల చిత్ర నిర్మాతలు చర్చలు జరిపారు. కానీ రాజమౌళి మాత్రం ఏప్రిల్ లోనే విడుదల చేస్తే బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కూడా భారీ స్థాయిలో కలెక్షన్స్ వస్తాయి అని ఆలోచిస్తున్నారట. మిగతా ఇండస్ట్రీల విషయాన్ని పక్కన పెడితే ఒక్క బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి వెయ్యి కోట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు రాజమౌళి అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది.
ఎందుకంటే బాహుబలి సినిమా తోనే రాజమౌళి భారీ స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. కాబట్టి అక్కడి ఆడియన్స్ కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తప్పకుండా హిందీ భాష లోనే RRR సినిమా భారీ స్థాయిలో వసూళ్లను అందుకునే అవకాశం ఉందట. ఈజీగా RRR సినిమా ఒక ఐదు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను ఫినిష్ చేసే విధంగా సినిమాను రిలీజ్ చేయాలని రాజమౌళి ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం.
సినిమా విడుదలకు ముందు ప్రమోషన్స్ తోనే భారీస్థాయిలో బజ్ క్రియేట్ చేయాలి అని మళ్ళీ ఆలోచనలో పడినట్లు సమాచారం. ఇక ఏప్రిల్ లో అయితే ఆచార్య, బీస్ట్, KGF చాప్టర్ 2 వంటి సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. ఆ సమయంలో పోటీకి సిద్ధపడి సినిమాను రిలీజ్ చేయక తప్పదు.
Most Recommended Video
ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!