SS Rajamouli: రాజమౌళి, వార్నర్.. యాడ్స్ పై ఫన్నీ సెటైర్లు..!

ఎస్.ఎస్.రాజ‌మౌళి (S. S. Rajamouli) ఓ సినిమా పనులు మొదలుపెట్టాడు అంటే పూర్తిగా వాటికే అంకితమైపోతాడు. జుట్టు, గడ్డం ఎంత పెరిగినా పట్టించుకోడు. ‘పని మూర్ఖుడు అయిపోతాడు, పిచ్చోడు అయిపోతాడు, గడ్డం మాసిపోయినా పట్టించుకోడు’ అంటూ మగధీర (Magadheera) టైంలో శ్రీహరి (Srihari) చెప్పుకొచ్చిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇక సినిమా ఫంక్షన్స్ కి వాటికి వెళ్లడం కూడా తక్కువే.! ఇక ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) పనులన్నీ పూర్తయ్యాక మహేష్ బాబు (Mahesh Babu) సినిమా పనులు మొదలుపెట్టాడు. కథ లాక్ అయ్యింది. ప్రీ ప్రొడక్షన్ పనులు కోసం రాజమౌళి ఎక్కువ టైం తీసుకున్నాడు.

పూర్తిగా వాటికోసమే అన్నట్టు బిజీ అయ్యాడు. కానీ ఇప్పుడు అతనికి కొంత బ్రేక్ దొరికిందేమో అనుకుంటాను.! సోష‌ల్ మీడియాలో ఇటీవల తన భార్యతో కలిసి ‘ప్రేమికుడు’ సినిమాలోని ఓ పాట‌కు స్టెప్పులు వేశాడు. ఆ వీడియో బాగా వైరల్ అయ్యింది.ఇక ఇప్పుడు వార్న‌ర్‌తో రాజమౌళి చేసిన ఓ యాడ్ హల్ చల్ చేస్తుంది. రాజమౌళి అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్ కూడా ఈ యాడ్ చూసి ఆశ్చర్యపోతున్నారు. ‘జక్కన్న 2 .ఓ’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరోపక్క మహేష్ బాబు అభిమానులు … ‘మాకు ఏ అప్డేట్ ఇవ్వకుండా మీరు మాత్రం బాగానే చిల్ అవుతున్నారు’ అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే రాజమౌళిలో ‘ఇంత మంచి యాక్టర్ కూడా ఉన్నాడు అని అనుకోలేదు’ అంటూ మరి కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. ‘సై’ (Sye) ‘మజ్ను’ (Majnu) ‘బాహుబలి'(ది బిగినింగ్) (Baahubali: The Beginning) వంటి సినిమాల్లో రాజమౌళి కూడా చిన్న కేమియోలు ఇచ్చిన సంగతి తెలిసిందే

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus