SS Thaman: పుష్ప 2: ఒక్క మాటతో క్లారిటీ ఇచ్చేసిన తమన్!

అల్లు అర్జున్ (Allu Arjun)   నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘పుష్ప 2’  (Pushpa 2) డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండగా, ఇప్పటికే పలు రికార్డులు క్రియేట్ అవుతున్నాయంటున్నారు. తాజాగా ఓటీటీ రైట్స్ ద్వారానే 250 కోట్లకు పైగా బిజినెస్ జరిగినట్లు టాక్ ఉంది. ముఖ్యంగా నార్త్ ఇండియాలో ఈ సినిమాపై విపరీతమైన క్రేజ్ నెలకొంది. ఇక ‘పుష్ప 2’ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad)  సాంగ్స్ కంపోజ్ చేస్తుండగా, రెండు పాటలు ఇప్పటికే విడుదలై సూపర్ హిట్ అయ్యాయి.

SS Thaman

కానీ, ఇప్పుడు ఈ సినిమా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ విషయంలో కొత్త రూమర్ వినిపిస్తోంది. ప్రముఖ సంగీత దర్శకుడు తమన్  (S.S.Thaman) ఓ ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలు ఈ వార్తలపై మరింత చర్చకు దారితీశాయి. తమన్ తనకు ‘పుష్ప 2’కి పని చేసే అవకాశం దక్కిందని హింట్ ఇచ్చినట్లు వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తే పుష్ప సీక్వెల్ బ్యాగ్రౌండ్ స్కోర్‌ కోసం సుకుమార్ (Sukumar)  తమన్‌ను తీసుకున్నారని కొందరు భావిస్తున్నారు.

ఈ నేపధ్యంలో, దేవిశ్రీ ప్రసాద్‌ను కేవలం సాంగ్స్‌కి మాత్రమే పరిమితం చేసినట్లు చర్చ జరుగుతోంది. ‘పుష్ప’ మొదటి పార్ట్‌కి దేవి శ్రీ ప్రసాద్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందించినప్పటికీ, ఈసారి సుకుమార్ మరింత ఇంపాక్ట్ ఉండేలా తమన్‌ని (SS Thaman) ఎంపిక చేసినట్లు గాసిప్ వినిపిస్తోంది. కానీ, మేకర్స్ నుంచి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడంతో ఈ ప్రచారం ఇంకా కొనసాగుతోంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ ప్రచారంపై మేకర్స్ త్వరగా స్పందించి క్లారిటీ ఇవ్వాలని సినీ విశ్లేషకులు సూచిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ప్రక్కన ఉండగానే బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం తమన్‌ను తీసుకోవడం అభిమానులలో కొంత సందేహాన్ని కలిగిస్తోంది. మరి దేవిశ్రీప్రసాద్ కంటే హై రేంజ్ లో తమన్ మంచి అవుట్ పూట్ ఇస్తాడో లేదో చూడాలి.

సైలెంట్ గా రెండో పెళ్లి చేసుకుంటున్న క్రిష్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus