Mahesh Babu,Trivikram: ‘మహేష్ 28’ రిలీజ్ డేట్ ను ప్రకటించిన చిత్ర బృందం..!

‘సర్కారు వారి పాట’ తర్వాత మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.మహేష్ బాబు కెరీర్లో 28వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ బ్యానర్ పై ఎస్.రాధా కృష్ణ నిర్మిస్తున్నారు. నిజానికి ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉండగా.. అనేక కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు ఈ నెలాఖరు(ఆగస్టు చివర్లో) నుండి షూటింగ్ ప్రారంభం కానుంది.

ఇదిలా ఉండగా.. ఈ చిత్రానికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇవ్వబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ సస్పెన్స్ కు తెర దించుతూ రిలీజ్ డేట్ ను ప్రకటించింది. 2023 ఏప్రిల్ 28న మహేష్- త్రివిక్రమ్ ల మూవీ విడుదల కానుందని చిత్ర బృందం కొద్దిసేపటి క్రితం ప్రకటించింది.ఆ రిలీజ్ డేట్ కు చాలా ప్రత్యేకత ఉంది. మహేష్ బాబు గతంలో నటించిన ‘పోకిరి’ చిత్రం ఏప్రిల్ 28 నే రిలీజ్ అయ్యి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

ఆ తర్వాత మహేష్ నటించిన ఏ మూవీ కూడా ఈ డేట్ కి రిలీజ్ కాలేదు. మళ్ళీ 17 ఏళ్ళ తర్వాత ‘పోకిరి’ రిలీజ్ డేట్ కు మహేష్ సినిమా రిలీజ్ కాబోతుంది. దీనికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు కావడంతో అంచనాలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి. ఇక ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా.. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ‘భీమ్లా నాయక్’ లో రానా భార్యగా నటించిన సంయుక్త మేనన్ కూడా ఈ మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నట్టు భోగట్టా.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus