SSMB28: మహేష్- త్రివిక్రమ్ మూవీ టైటిల్.. అందులో నిజం లేదా?

మ‌హేష్ బాబు – త్రివిక్ర‌మ్ కాంబినేషన్లో మూడో సినిమా రాబోతుంది.జూలై నుండీ ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. 2023 సంక్రాంతి కానుకగా ఈ మూవీ విడుదల తేదీ టార్గెట్ గా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరపడానికి చిత్ర బృందం రెడీగా ఉంది. అయితే ఈ చిత్రం టైటిల్ ను టీం వెల్లడించకుండానే ఎవరికీ వారు ఫిక్స్ చేసేసుకుంటున్నారు. కనీసం ఈ మూవీ ఏ జోన‌ర్‌ కు సంబంధించింది అనే విషయం కూడా జనాలకి తెలీదు.

అయినా సరే టైటిల్ విషయంలోనూ, జోనర్ విషయలంలోనూ రూమర్స్ ను స్ప్రెడ్ చేస్తున్నారు. దాదాపు సంవత్సరం నుండీ త్రివిక్రమ్ ఈ క‌థ‌పై వర్క్ చేస్తున్నారు. స్క్రిప్టు కూడా ఈ మధ్యనే లాక్ అయ్యింది. ఇక మొన్నటి వరకు ఈ చిత్రం టైటిల్ పార్ధు అంటూ ప్రచారం జరిగింది. ‘అతడు’ సినిమాలో మహేష్ క్యారెక్టర్ పేరు అది. దాదాపు అదే ఫిక్స్ అని అంతా అనుకున్నారు. కానీ `అర్జునుడు` అనేది అసలు టైటిల్ అంటూ గత రెండు రోజుల నుండీ మరో వార్త హల్ చల్ చేస్తుంది.

త్రివిక్రమ్ కు ‘అ’ అనే అక్షరాన్ని టైటిల్ గా పెట్టడం సెంటిమెంట్. అందుకే దాదాపు దానినే లాక్ చేసే అవకాశం ఉంది అని అంతా అనుకుంటున్నారు. కాకపోతే మహేష్ ఆల్రెడీ ‘అర్జున్’ అనే టైటిల్ తో సినిమా చేశాడు.గుణశేఖర్ దానికి దర్శకుడు.ఆ సినిమా అంతంత మాత్రంగా ఆడింది.

ఇప్పుడు మరోసారి ‘అర్జునుడు’ టైటిల్ ను ఎలా ఫిక్స్ చేస్తారు అంటూ చిత్ర బృందం చెప్పుకొస్తుంది. ఇది రూమరా? లేక నిజమా అనేది మే 31న కృష్ణ గారి పుట్టిన రోజు నాడు తెలిసొస్తుంది. ఇక తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus