Adipurush: ఘనంగా ప్రభాస్ ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఏర్పాట్లు!

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఆది పురుష్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. రామాయణం ఇతిహాసం నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా జూన్ 16వ తేదీ విడుదల కానుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు పాటలను విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే.

ఇకపోతే ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో తిరుపతిలో జూన్ 6వ తేదీ ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటివరకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఏ సినిమాకి చేయని విధంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను చేయాలని మేకర్స్ భావించినట్టు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుకకు సంబంధించిన ఏర్పాటు తిరుపతిలో ఘనంగా జరుగుతున్నట్టు తెలుస్తుంది.

అయితే ఈ వేడుకకు సుమారు లక్ష మంది అభిమానులు హాజరయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారట. అదే విధంగా 200 మంది డాన్సర్లతో పాటు సింగర్లను కూడా ఏర్పాటు చేసి వారి చేత పర్ఫామెన్స్ చేయించబోతున్నారని సమాచారం. ఇక ఈ వేడుకలో ప్రత్యేకంగా క్రాకర్స్ కూడా ఏర్పాటు చేశారని తెలుస్తుంది. ఈ క్రాకర్స్ కనుక పేలిస్తే జైశ్రీరామ్ అనే శబ్దం వచ్చే విధంగా తయారు చేయించారని తెలుస్తుంది.

ఇలా (Adipurush) ఈ సినిమా వేడుకను ఇప్పటివరకు జరగని విధంగా నిర్వహించి సరికొత్త చరిత్రను సృష్టించాలని మేకర్స్ భారీగానే ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించగా సీతమ్మ పాత్రలో నటి కృతి సనన్ నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ చిత్రానికి బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహించారు.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus