కెరీర్ ప్రారంభంలో వరుస విజయాలు అందుకున్న రాజ్ తరుణ్.. తర్వాత ఫామ్ కోల్పోయి ఒక్కంటంటే ఒక్క హిట్టు కొట్టడానికి చాలా కష్టపడుతున్నాడు. గతేడాది చివర్లో ‘అనుభవించు రాజా ‘ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాజ్ తరుణ్ .. ఓ బిలో యావరేజ్ మూవీతో సరిపెట్టుకున్నాడు. ఈసారి స్టాండప్ రాహుల్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. టీజర్, ట్రైలర్ కాస్త సినిమా పై బజ్ ను క్రియేట్ చేశాయి. రాజ్ తరుణ్ లుక్స్ కూడా బాగానే అనిపించాయి. మరి సినిమా ఏ మాత్రం ప్రేక్షకులను అలరించిందనే విషయం పై ఓ లుక్కేద్దాం రండి :
కథ : హీరో తల్లిదండ్రులు ప్రేమించి పెళ్ళి చేసుకున్నప్పటికీ తర్వాత మనస్పర్థలు రావడంతో విడిపోతారు. దాంతో ప్రేమించి పెళ్ళి చేసుకున్నప్పటికీ.. పెళ్ళయ్యాక ప్రేమ అనేది నిలబడదని… దానికంటే లివింగ్ రిలేషన్ షిప్ బెటర్ అని ఫిక్స్ అవుతాడు రాహుల్(రాజ్ తరుణ్). అంతేకాదు రాహుల్ తండ్రి( మురళీ శర్మ) .. పెళ్ళయ్యాక తన ప్యాషన్ ను, గోల్ ను నెరవేర్చుకోవడానికి ఓ సినిమా తీస్తాడు.ఆ సినిమాకి నేషనల్ అవార్డ్ వస్తుంది కానీ జనాలు రారు. రాహుల్ తండ్రే నిర్మాత కాబట్టి .. అప్పుల పాలు అవుతాడు.
ఇక నుండీ ప్యాషన్ ను వదిలేసి కుటుంబం పట్ల బాధ్యతగా ఉండమని రాహుల్ తల్లి( ఇంద్రజ) .. తన తండ్రితో గొడవ పడుతుంది. దీంతో ప్యాషన్ కంటే బాధ్యతగా ఉండడమే ముఖ్యం అని తనకి ఇష్టమైన స్టాండప్ కామెడీని వదిలేసుకోవాలి అనుకుంటాడు రాహుల్. అయితే శ్రేయా రావు( వర్ష బొల్లమ) అతని జీవితంలోకి ఎంటర్ అవ్వడం, ఆమెతో రాహుల్ ప్రేమలో పడడం ఆ తర్వాత జరిగిన పరిస్థితులు ఏంటి అన్నదే మిగిలిన కథ.
నటీనటుల పనితీరు : రాజ్ తరుణ్ గత చిత్రాలతో పోలిస్తే ఈ చిత్రంలో కొత్త లుక్ తో కనిపించాడు. తన మార్క్ కామెడీతో కొన్ని చోట్ల అలరించాడు. అయితే ఎమోషనల్ సీన్స్ లో తేలిపోయాడు. హీరోయిన్ వర్ష బొల్లమ..నటన బాగుంది. ఆమె అమాయకపు లుక్స్ కూడా ఆకట్టుకుంటాయి. అయితే ఫస్ట్ లుక్ లో ఈమె పంటికి క్లిప్స్ తో డిఫరెంట్ గా కనిపించింది. సినిమాలో ఒక్క సీన్లో మాత్రమే అలా కనిపిస్తుంది.
ఆ లుక్ ప్రమోషన్ కోసం మాత్రమే వాడుకున్నారు అన్న మాట. మురళీ శర్మ హీరో తండ్రి పాత్రలో చాలా చక్కగా నటించాడు. ఇక తల్లి పాత్రలో ఇంద్రజ కూడా ఒదిగిపోయింది. చాలా కాలం తర్వాత ఆమెకు మంచి పాత్ర దొరికింది.కాస్త ఎక్కువ స్క్రీన్ స్పేస్ కలిగిన పాత్ర కూడా. మిగిలిన పాత్రలు పెద్దగా గుర్తుండవు. వెన్నెల కిషోర్ పాత్ర అయితే చాలా విసిగిస్తుంది.
సాంకేతిక నిపుణుల పనితీరు : దర్శకుడు శాంటో అనుకున్న పాయింట్ బాగుంది. ప్రొఫెషనల్ లైఫ్ ను ప్యాషన్ ను బ్యాలన్స్ చేసుకుంటూ సాగినప్పుడు ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అవ్వదు అని అతను చెప్పాలనుకున్న పాయింట్. కానీ దానికి స్టాండప్ కామెడీని జోడించి.. తర్వాత లివింగ్ రిలేషన్ అంటూ లవ్ స్టోరీని తీసుకొచ్చి, సిల్లీ కామెడీ తో కిచిడి కిచిడి చేసేశాడు. గతేడాది చివర్లో వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లో హీరో ఇలాగే ఓ కన్ఫ్యూజన్ లో ఉండడం, హీరోయిన్ వల్ల మారడం, అందులో కూడా స్టాండప్ కామెడీ టచ్ ఉండడం మనం చూశాం.
ఇందులో కూడా ఆ సినిమా ఛాయలు కనిపిస్తాయి. అయితే క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ బాగానే ఉంటాయి. దర్శకుడు టేకింగ్ విషయంలో జాగ్రత్త పడి ఉంటే అవుట్పుట్ బాగా వచ్చి ఉండేది. ఇక సినిమాటోగ్రఫీ , బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. పాటలు ఏమాత్రం గుర్తుండవు.
విశ్లేషణ : స్టాండప్ రాహుల్ లో యూత్ ను అట్రాక్ట్ చేసే కంటెంట్ ఉంది, ఫ్యామిలీ ఆడియెన్స్ కు కనెక్ట్ అయ్యే ఎమోషనల్ సీన్స్ కూడా ఉన్నాయి. కాకపోతే నెరేషన్ గ్రిప్పింగ్ గా లేకపోవడం.. కామెడీ వర్కౌట్ అవ్వకపోవడంతో వృధా ప్రయత్నంగా మిగిలిపోతుంది.