సినీ పరిశ్రమలో విషాదాల సంఖ్య తగ్గడం లేదు. టాలీవుడ్లోనే కాకుండా.. పక్క భాషల్లోని సినీ సెలబ్రిటీలు కూడా ప్రాణాలు విడుస్తున్న సందర్భాలు అందరం చూస్తూనే ఉన్నాం. వయసు మీద పడి మరణించే వారి సంఖ్య ఎక్కువగా కనిపిస్తూ ఉండగా… అనారోగ్య సమస్యలతో మరణించేవారు ఇంకొంతమంది, లేదు అంటే బలవన్మరణాలకు పాల్పడుతున్న వారు ఇంకొంతమంది, అలాగే రోడ్డు ప్రమాదాలకు గురై మరణిస్తున్న వారు ఇంకొంతమంది ఇలా ఎవరొకరి మరణ వార్తలు వింటూనే ఉన్నాం.
ఈ మధ్యనే కోలీవుడ్ సీనియర్ నటుడు శంకరన్, మాలీవుడ్ నటి లక్ష్మిక సజీవన్ వంటి వారు మరణించారు. ఈ షాక్ ల నుండి సినీ పరిశ్రమ ఇంకా కోలుకోక ముందే మరో సీనియర్ నటుడు మరణించడం జరిగింది. వివరాల్లోకి వెళితే.. బోజ్‌పూరి సినీ పరిశ్రమకి చెందిన సీనియర్ నటుడు బ్రిజేష్ త్రిపాఠి కొన్ని గంటల ముందు మరణించడం జరిగింది. కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వస్తున్న ఆయన.. ఇటీవల ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చారట.
తర్వాత బాగానే ఉంది అని డాక్టర్లు డిశ్చార్జ్ చేసినప్పటికీ…నిన్న ముంబైలో ఉన్న ఆయన నివాసంలో సడన్ గా హార్ట్ ఎటాక్ వచ్చిందట. వెంటనే కుటుంబ సభ్యులు హాస్పిటల్ కి తరలించారట, అయితే వైద్యులు చికిత్స అందిస్తున్న టైంలో ఆయన ప్రాణాలు విడిచినట్టు తెలుస్తుంది. ‘సాయా తొహారే కరణ్’ అనే సినిమాతో నటుడిగా మారిన (Brijesh Tripathi) బ్రిజేష్ త్రిపాఠి.. దాదాపు 250 కి పైగా సినిమాల్లో నటించినట్టు తెలుస్తుంది.