‘రేసుగుర్రం’ విలన్ రవి కిషన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు..! అల్లు అర్జున్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మద్దాలి శివారెడ్డి పాత్రలో అద్భుతంగా నటించాడు. భోజ్ పూరి సినిమాల్లో ఇతను హీరోగా నటించి స్టార్ డమ్ ని సంపాదించుకున్నాడు అన్న సంగతి బహుశా ఎక్కువమందికి తెలిసుండదు. బాలీవుడ్లో కూడా ఇతను చాలా సినిమాల్లో నటించాడు.ఇతను పెద్ద పొలిటీషియన్ అన్న సంగతి కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది.
గోరఖ్ పూర్ ఎం.పి గా ఇతను ప్రజలకు సేవలందిస్తున్నాడు.! తెలుగులో ‘రేసు గుర్రం’ తో పాటు ఇతను ‘కిక్2’ ‘సుప్రీమ్’ ‘ఒక్క అమ్మాయి తప్ప’ ‘రాధా’ ‘లై’ ‘ఎం.ఎల్.ఎ’ ‘సాక్ష్యం’ ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ‘సైరా నరసింహారెడ్డి’ ’90 ఎం ఎల్’ ‘గడ్డలకొండ గణేష్’ ‘హీరో’ వంటి సినిమాల్లో నటించాడు. అయితే సినీ పరిశ్రమలో ఇప్పటి వరకు క్యాస్టింగ్ కౌచ్ అనేది కేవలం అమ్మాయిలకు మాత్రమే ఉంటుంది అని అంతా అనుకున్నారు.
కానీ మేల్ ఆర్టిస్ట్ లకు కూడా ఉంటుందని తాజా ఇంటర్వ్యూలో రవికిషన్ చెప్పి షాకిచ్చాడు. తాజాగా రజత్ శర్మ చాట్ షో ‘ఆప్ కి అదాలత్ ‘ కు హాజరైన రవి కిషన్… “నేను కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితుడినే. ఓ రాత్రి ఊహించని సంఘటన జరిగింది. కప్పు కాఫీ కోసం తన ఇంటికి రమ్మని ఓ నటి నన్ను పిలిచింది. కానీ, ఆ పరిస్థితి నుంచి నేను ఎలాగోలా తప్పించుకోగలిగాను.
ఎందుకంటే నా పనిని నిజాయితీగా ముందుకు తీసుకెళ్లాలని మా నాన్న నేర్పించారు. మా అమ్మ నాకు జీవితమంతా మద్దతుగా ఉంది. అందుకే ఎప్పుడూ షార్ట్ కట్స్ తీసుకోవాలనుకోలేదు. నేను ప్రతిభావంతుడినని నాకు తెలుసు. నన్ను పిలిచిన నటి పెద్ద స్టార్. కానీ ఆమె పేరు నేను చెప్పదలుచుకోలేదు” అంటూ చెప్పుకొచ్చాడు. రవికిషన్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!
తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?